Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్
వరుస సినిమా షూటింగ్స్ బిజీగా ఉన్న సమంత కాస్తా బ్రేక్ తీసుకొని తన తల్లితో ఆనందంగా గడుపుతోంది.
- By Balu J Published Date - 12:21 PM, Fri - 26 May 23

ఒకవైపు వ్యక్తిగత ఇబ్బందులు (Personal Prbolems).. మరోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడినా తగ్గేదేలే అంటూ సమంత (Samantha) వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. యశదో, శాకుంతలం సినిమాలతో అలరించిన సమంత, ఖుషి సినిమాతో పాటు సిటాడెట్ వెబ్ సిరీస్ షెడ్యూల్ ను దాదాపు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలు తుదిదశకు చేరుకోవడంతో సమంత షూటింగ్స్ (Shootings) నుంచి కొంత బ్రేక్ తీసుకొని హైదరాబాద్‌లో ఇంటికి తిరిగి వచ్చారు.
నిన్న తన తల్లితో కలిసి డిన్నర్ డేట్ కోసం వెళ్లింది. ఎంతో ఇష్టమైన డెజర్ట్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోను షేర్ చేసింది సమంత. ఈ సందర్భంలో తన తల్లితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. సమంత సింపుల్ గా నలుపు (Black) దుస్తులు ధరించి, కొద్దిపాటి మేకప్ తో అందంగా కనిపించింది. నాగచైతన్యతో సమంత విడిపోయిన సమయంలో, స్కిన్ డీసీజ్ తో బాధపడుతున్న సమయంలోనూ సమంత తల్లి అండగా నిలిచింది. ఎల్లప్పుడు సమంతకు అండగా నిలుస్తూ ఆనందంగా ఉంచేలా ప్రయత్నిస్తోంది.
గతంలో తన తల్లి ప్రభు పంపిన సందేశాన్ని “దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా బిడ్డ.” అనే కోట్ ను సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం సమంత డిన్నర్ డేట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యాయి.
Also Read: Mobile Effects: ఎక్కువ సమయం ఫోన్ మాట్లాడితే ఇక అంతే సంగతులు!
Related News

Mega Update: భోళా మేనియా త్వరలో ప్రారంభం.. మాస్ స్టెప్పులకు మెగాస్టార్ రెడీ!
ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో ఆకట్టుకున్న మెగా స్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ తో మన ముందుకు రాబోతున్నాడు.