Brahmastra Trailer : ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ పై హాట్ టాక్.. షారుక్, నాగార్జున పాత్రలు స్పెషల్
రణ్‌బీర్, ఆలియా, నాగార్జున, అమితాబ్‌ల పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ విడుదలైంది.
- By Hashtag U Published Date - 08:00 PM, Wed - 15 June 22

రణ్‌బీర్, ఆలియా, నాగార్జున, అమితాబ్‌ల పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా 3 భాగాలుగా తెర కెక్కుతోంది. దీనికి సంబంధించిన మొదటి భాగం సెప్టెంబరు 9న విడుదల కానుంది.
రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈనేపథ్యంలో ట్రైలర్ పైన ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని స్పష్టంగా ప్రస్తావించారు. చేతిలో త్రిశూలం పట్టుకున్న రణ్‌బీర్ వెనకాల మహాదేవుడు పరమశివుడున్నారు. ‘బ్రహ్మాస్త్ర’… ‘సారే అస్త్రో కా దేవతా’ అని పోస్టర్‌లో ఉంది. పురాణాల ప్రకారం..”బ్రహ్మాస్త్రం” అనేది తిరుగులేని అస్త్రం. ఈ మూవీని దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ నేపథ్యంలో తెరకెక్కించారని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. పంచ భూతాలైన భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశాలను చెరపట్టే దుష్టశక్తులను అంతం చేసే అతీంద్ర శక్తులున్న మనిషి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. ముఖ్యంగా అతన్ని అగ్ని కాల్చదు. నీరు తడపలేదు. భగవద్గీతలో ఆత్మకు ఉన్న లక్షణాలు హీరోకు ఉంటాయి.ట్రైలర్ లోని సీన్ లను బట్టి ఈవిషయం తేటతెల్లం అవుతోంది.
షారుక్, నాగార్జున కనిపించేది ఈ పాత్రల్లోనేనట..
ఈ సినిమాలో హీరో నాగార్జున ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీలో నాగార్జున నటిస్తోన్న చిత్రం ఇదే. ఇక షారుక్ సైంటిస్టుగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. బ్రహ్మాస్త్రాన్ని కనుగొనాలనే అన్వేషణలో రణ్ బీర్ కపూర్..నాగ్, షారుక్‌ను సంప్రదిస్తాడట. ఇక బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Related News

Alia Bhatt Pregnant: అలియా తల్లి కాబోతోంది!
బాలీవుడ్ బ్యూటీ అలియా తల్లి కాబోతోంది. అదేంటి పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..