Brahmanandam Auto Biography : బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీకి ఫుల్ డిమాండ్..!
Brahmanandam Auto Biography బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీగా నేను అనే పుస్తకం పబ్లిష్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన విజయవాడ పుస్తక ప్రదర్శనతో
- By Ramesh Published Date - 02:07 PM, Sat - 30 December 23

Brahmanandam Auto Biography బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీగా నేను అనే పుస్తకం పబ్లిష్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన విజయవాడ పుస్తక ప్రదర్శనతో పాటుగా మరికొన్ని చోట్ల ఈ పుస్తకాలను అమ్మకానికి ఉంచారు. బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీ బుక్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. మొదట రిలీజైన 2000 వేల బుక్స్ సేల్ అయినట్టుగా పబ్లిషర్స్ చెబుతున్నారు.
నేను అనే టైటిల్ తో బ్రహ్మి ఆటో బయోగ్రఫీ ఆయనే తన సొంతంగా రాశారు. ఈ బుక్ లో తన అనుభవాలను.. ఆలోచనలను పంచుకున్నారు బ్రహ్మానందం. రీసెంట్ గా రిలీజైన ఈ పుస్తకం పై బ్రహ్మానందం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ బుక్ ఆఫ్ లైన్ స్టోర్స్ తో పాటుగా ఆన్ లైన్ లో అమేజాన్ లో కూడా బుక్ చేసుకుని మరీ కొనేస్తున్నారు.
Also Read : Mrunal Thakur : మృణాల్ డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది..!
బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీ గా రాసిన నేను పుస్తకం మొదట ప్రింట్ చేసిన 2000 పుస్తకాలు అమ్ముడయ్యాయని పుస్తకాన్ని పబ్లిష్ చేసిన వారు ప్రకటించారు. మొదటి ఎడిషన్ 2000 బుక్స్ కేవలం 3, 4 రోజుల్లోనే సేల్ అయ్యాయి. త్వరలోనే సెకండ్ ఎడిషన్ గా ఈసారి ఎక్కువ ప్రింట్స్ వేయాలని చూస్తున్నారు పబ్లిషర్స్.
రీసెంట్ గా బ్రహ్మానందం తన ఆటోబయోగ్రఫీ బుక్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన విషయం తెలిసిందే. చిరు ఈ బుక్ గురించి ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేశారు. బ్రహ్మానందం నేను బుక్ ప్రస్తుతం మార్కెట్ లో దొరకట్లేదు. సెకండ్ ఎడిషన్ కోసం ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join