Bigg Boss 7: బిగ్ బాస్ సీసన్ 7కి అదిరిపోయే రేటింగ్.. షోకి పూర్వ వైభవం వచ్చిందిగా?
తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవల మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తి చేసుకుంది. ఇందు
- By Nakshatra Published Date - 02:40 PM, Fri - 15 September 23
తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవల మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగానే 14 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అయితే ఈ షో ప్రారంభానికి ముందు నుంచే హోస్ట్ నాగార్జున ఉల్టా పుల్టా అని చెబుతూ షోపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేశారు. అయితే ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ షో ని బాగానే ఆదరిస్తున్నారు. గత సీజన్ లతో పోల్చుకుంటే ఈసారి సీజన్ విభిన్నంగా ఉండడంతో ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు అని చెప్పవచ్చు.
మొదటివారం చప్పగా సాగిన రెండవ వరం నామినేషన్స్ సమయం నుంచి అసలైన వేడి మొదలైంది. దీంతో బిగ్ బాస్ షో కి పూర్వ వైభవం వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో సంచలనాలకు వేదికైందని రేటింగ్స్ పరంగా, వ్యూయర్షిప్ పరంగా ఊహించని అద్భుతాలకు దారి తీసిందని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు. సీజన్ సీజన్‌కి అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్‌కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త ప్రమాణాలను సృష్టించిందని స్టార్ మా తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారనీ, ఇంచుమించు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నట్లు వెల్లడించారు.
బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణ పరంగా నమోదైన రికార్డులను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించటం విశేషం అని తెలిపారు. గత సీజన్లో సాధించిన రేటింగ్ తో పోలిస్తే 40 శాతం అధిక రేటింగ్ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తిరుగులేని ఈ ప్రేక్షకాదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా నెంబర్ 1 ఛానల్‌గా తన స్థానాన్ని మరోమారు నిలబెట్టుకుందని బిగ్ బాస్ సీజన్ 7 ను సాక్షిగా వెల్లడించింది. ఈ సీజన్ ఉల్టా పల్టాగా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్‌ను సరాసరిన 7.1 రేటింగ్‌తో చూస్తే , మెట్రో నగరమైన హైదరాబాద్ లో అత్యధికంగా 8.7 రేటింగ్ తో వీక్షించడం విశేషం. మొత్తానికి ఈ బిగ్ బాస్ కి పూర్వ వైభవం వచ్చింది. చివరి వరికు ఇదే కనుక కంటిన్యూ అయితే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని తెలుస్తోంది.
Related News
Bigg Boss7: బిగ్ బాస్ పై హైకోర్టుకు సిపిఐ నారాయణ లేఖ
రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 అనంతరం చోటుచేసుకున్న హింస, విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.