BiggBoss Reviewer Adi Reddy : నెలకు 39 లక్షలు.. కంటెస్టెంట్స్ కన్నా ఆ రివ్యూయర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా..?
BiggBoss Reviewer Adi Reddy బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యి ఆ బిగ్ బాస్ నే తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు బిగ్ బాస్ రివ్యూయర్
- By Ramesh Published Date - 06:02 PM, Tue - 14 November 23

BiggBoss Reviewer Adi Reddy బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యి ఆ బిగ్ బాస్ నే తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి. మొదటి సీజన్ ఏమో కానీ 2018 నుంచి బిగ్ బాస్ సీజన్ 2 నుంచి ఆది రెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ మొదలు పెట్టాడు. తను రివ్యూయర్ గా బిగ్ బాస్ రివ్యూస్ చెబుతున్నప్పటి నుంచి ఎపిసోడ్ తో పాటుగా తన రివ్యూస్ కూడా చూడాలి అనేంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. ఈ క్రమంలో బిగ్ బాస్ వల్ల అందులోకి వెళ్లొచ్చిన కంటెస్టెంట్స్ కన్నా రివ్యూస్ చెబుతూ వచ్చిన ఆది రెడ్డి పాపులర్ అవుతూ వచ్చాడు.
దీంతో బిగ్ బాస్ టీం కూడా కామన్ మ్యాన్ కేటగిరి కింద బిగ్ బాస్ 6లో భాగం కల్పించారు. ఆ సీజన్ లో టాప్ 5 దాకా వెళ్లి తన ఇమేజ్ మరింత పెంచుకున్నాడు ఆది రెడ్డి. సరదాగా మొదలు పెట్టిన బిగ్ బాస్ రివ్యూస్ తనకు ఒక ఆదాయ మార్గంగా మారి అతన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా వచ్చేలా చేసింది. ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక కూడా ఆది రెడ్డి రివ్యూస్ చెబుతూ వస్తున్నాడు.
Also Read : Bigg Boss 7 : అతను డబుల్ గేమ్ ఆడుతున్నాడా.. వాళ్ల మీదకు రతికని రెచ్చిగొట్టింది ఎవరు..?
ప్రతి సీజన్ లానే బిగ్ బాస్ సీజన్ 7 రివ్యూస్ ని కూడా చెబుతూ తన ఫాలోవర్స్ ని అలరిస్తున్నాడు ఆది రెడ్డి. తనకున్న 5 లక్షల సబ్ స్క్రైబర్స్ వల్ల ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. దాని వల్ల అతనికి యూట్యూబ్ నుంచి భారీ ఆదాయం వస్తుంది. లేటెస్ట్ గా ఆది రెడ్డి అక్టోబర్ నెల తన బిగ్ బాస్ సంపాదన ఎంత అన్నది రివీల్ చేశాడు. తనకు వచ్చిన సంపాదన గురించి చెప్పుకోవడంలో తనకు ఎలాంటి మొహమాటం లేదని చెప్పాడు ఆది రెడ్డి.
అక్టోబర్ నెలలో తనకు యూట్యూబ్ నుంచి 39 లక్షల రూపాయలు వచ్చాయని చెప్పి షాక్ ఇచ్చారు ఆది రెడ్డి. అయితే ఇదంత తేలికగా వచ్చింది కాదని తను 24 గంటలు బిగ్ బాస్ లైవ్ చూస్తానని.. ప్రతి నిమిషం బిగ్ బాస్ చూడటం వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. అంతేకాదు తనలా యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించాలనే వారికి మంచి సలహా ఇచ్చారు ఆది రెడ్డి. చేసే పనిలో ఎలాంటి వెనకడుగు వేయకుండా వెళ్లాలని అన్నారు.
We’re now on WhatsApp : Click to Join