Bigg Boss Season 6: గీతూ దెబ్బకు కెప్టెన్సీ టాస్క్ నుంచి శ్రీహాన్ ఔట్!
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. కాగా ఇప్పటికే మొదటి వారాన్ని పూర్తి
- By Nakshatra Published Date - 11:40 PM, Wed - 14 September 22

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. కాగా ఇప్పటికే మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సిసింద్రీ అనే కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చాడు. తాజాగా మంగళవారం రాత్రి జరిగిన ఈ సిసింద్రీ టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో జరిగిన టాస్కులో చలాకీ చంటి విజయం సాధించి తొలి కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లు ఫైమా,రేవంత్ ల మధ్య యుద్ధం జరిగింది.
అప్పుడు రేవంత్ అక్కడ జరిగిన దానికి అసహనంతో తన బొమ్మను అక్కడే వదిలేశాడు. అయితే ఈ సిసింద్రీ టాస్క్ లో మొదటి పోటీదారుడిని ఎంపిక చేసిన తర్వాత విరామం ప్రకటించాడు బిగ్ బాస్. అనంతరం సిసింద్రీ టాస్క్ బుధవారం కంటిన్యూ అవుతుందని చెప్పి కంటెస్టెంట్ ల దగ్గర ఉన్న బొమ్మలను తమ దగ్గరే దాచుకోవాలని కూడా చెప్పాడు. ఇది ఇలా ఉంటే నేడు జరగనున్న ఈ సిసింద్రీ టాస్క్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇక ఆ ప్రోమోలో తెల్లవారుజామున సమయంలో శ్రీహాన్,అర్జున్ కల్యాణ్ బెడ్ దగ్గరకు వెళ్లి అతడి బొమ్మను దొంగతనం చేసి తీసుకొచ్చాడు.
ఆ వెంటనే డిస్‌క్వాలి ఫై చేసే ప్రాంతంలో దాన్ని పెట్టడంతో ఇదే విషయం పై అర్జున్ శ్రీహాన్‌తో గొడవకు కూడా దిగాడు. అర్జున్ కళ్యాణ్ బొమ్మను దొంగలించిన తర్వాత శ్రీహాన్ ఇతర కంటెస్టెంట్ల దగ్గరికి కూడా వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే గీతు రాయల్ బెడ్ దగ్గరికి వెళ్లి ఆమె దుప్పట్లు చెయ్యి పెట్టి పైకి లేపాడు. ఆ బొమ్మ ఆమె టి షర్ట్ లో ఉండడంతో భయపడి అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయాడు.
Related News

Bigg Boss Winner: ‘బిగ్ బాస్ సీజన్ 6’ విన్నర్ అతడే!
తెలుగు బిగ్ బాస్ (Bigg boss) సీజన్ 6 ఎండింగ్ కు చేరుకుంది. విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది