Bigg Boss Telugu 6: గీతూ ఎలిమేషన్.. హౌస్‌లో ఎమోషన్.. బిగ్ బాస్‌లో ఏం జరుగుతోందో తెలుసా!
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేషన్ కాబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో విడుదల చేశారు. మొదటి నుంచి ఆటలో తనదైన మార్క్ చూపిన గీతూ.. తర్వాత తన ప్రవర్తన కారణంగా ఎలిమినేషన్ అయ్యే వరకు తెచ్చుకుంది.
- Author : Anshu
Date : 06-11-2022 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేషన్ కాబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో విడుదల చేశారు. మొదటి నుంచి ఆటలో తనదైన మార్క్ చూపిన గీతూ.. తర్వాత తన ప్రవర్తన కారణంగా ఎలిమినేషన్ అయ్యే వరకు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించింది మొదలు.. తన ఆటే తనకు ముఖ్యమంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ వచ్చింది గీతూ. ఈ క్రమంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హౌస్ లో ఆటలోకి ఒక్కసారి దిగితే ఎవరినైనా లెక్కచేయబోనని గీతూ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అది నిజమని చాలా సార్లు రుజువు చేసింది. అన్నట్లుగానే ఆట కోసం తనకు దగ్గరైన వాళ్లను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి చేరుకుంది. తాను ఏం చేసినా ఆట కోసమేనంటూ సూటిగా చెప్పేసింది. బిగ్ బాస్ గేమ్ అంటే అంత ఇష్టంగా ఆడింది గీతూ.
తర్వాత రాను రానూ.. గీతూ వ్యవహార శైలి హౌస్ లోని కంటెస్టెంట్లతో పాటు జనాలకు కూడా నచ్చలేదు. ఎదుటి వారి బలహీనలతో ఆడుకోవడం, అదేపనిగా టార్గెట్ చేయడం లాంటి చర్యలు ప్రేక్షకులకు నచ్చలేదు. గీతూకు తగినంత బుద్ధి బలం ఉన్నప్పటికీ దాన్ని సరిగా వినియోగించుకోలేక పోయిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
అనూహ్యంగా గీతూ ఎలిమినేట్..
ఇంటి సభ్యులతో ఫన్ గేమ్ ఆడించి, వారిని రిలాక్స్ చేశాడు నాగార్జున. ఈ క్రమంలో అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి సత్య, గీతూ మిగిలారు. వీరిలో ఎవరికి వారు తాము సేవ్ అవుతామని భావించారు. కానీ చివరకు గీతూ ఎలిమినేట్ అవుతోంది. గీతూ ఎలిమినేషన్ ఖాయం కావడంతో ఇంటి సభ్యుల్లో ముఖ్యంగా ఫైమా, శ్రీహాన్ ఉండలేకపోయారు. కంటతడి పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.