Bigg Boss 7 : శోభాని కెప్టెన్ చేసి పంపించేస్తారా..?
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో కొత్త కెప్టెన్ గా శోభా శెట్టి నిలిచింది. ఈసారి కెప్టెన్ గా అయ్యేందుకు కంటెండర్స్ మధ్య కాకుండా వారికి సపోర్ట్ ఇచ్చే వారి మధ్య పోటీ
- Author : Ramesh
Date : 04-11-2023 - 8:57 IST
Published By : Hashtagu Telugu Desk
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో కొత్త కెప్టెన్ గా శోభా శెట్టి నిలిచింది. ఈసారి కెప్టెన్ గా అయ్యేందుకు కంటెండర్స్ మధ్య కాకుండా వారికి సపోర్ట్ ఇచ్చే వారి మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్. దాని వల్ల అమర్ దీప్ (Amardeep) తన కోసం కన్నా శోభాని గెలిపించాలనే కసితో ఆట ఆడాడు. అల బస్తాలను కాపాడుకునే టాస్క్ లో అమర్ విజేతగా నిలిచి శోభా శెట్టి (Shobha Shetty)ని కెప్టెన్ అయ్యేలా చేశాడు. అయితే శోభా కెప్టెన్ అవడం వరకు బాగానే ఉన్నా ఈ వారం నామినేషన్స్ లో ఉండటమే కాకుండా లీస్ట్ ఓటింగ్స్ లో ఉంది.
గత వారమే శోభా వెళ్లిపోతుంది అన్నట్టుగా ఊహాగానాలు రాగా ఆల్రెడీ ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ వెళ్లారని చిన్న గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ సందీప్ (Sandeep) మాస్టర్ ని ఎలిమినేట్ చేశాడు. ఈ వారం కూడా ఎలిమినేషన్ అనేది పురుషుల్లో ఉంటుందా లేడీ కంటెస్టెంట్ అవుతాడా అన్నది చూడాలి. శోభా శెట్టి తో పాటు తేజ కూడా లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు. తేజ వెళ్లడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.
Also Read : Keeda Cola Review & Rating : కీడా కోలా : రివ్యూ
ఈ వారం శోభాని ఇంటి నుంచి బయటకు పంపించాలని బిగ్ బాస్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే కెప్టెన్ అయ్యింది కదా ఈ టైం లో శోభా ఎలిమినేషన్ షో మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అంతేకాదు శోభా వల్ల కంటెంట్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఎలిమినేట్ చేసే అవకాశం లేదని అంటున్నారు. కానీ శోభా ని కెప్టెన్ చేసి పంపించడం వల్ల షోకి ఓ విధంగా ప్లస్ అవుతుందని కావాల్సినంత హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వారం ఎలిమినేషన్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని మాత్రం అర్ధమవుతుంది.
ఒకవేళ తేజ, శోభాలలో ఇద్దరు కాకపోతే ఆ తర్వాత పొజిషన్ లో ఉన్న ప్రియాంకా అయినా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join