Bigg Boss 6: పాము నిచ్చెన టాస్క్..జుట్టు జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఫైమా, ఇనయ?
బిగ్ బాస్ హౌస్ లో పదో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బాగా పాము నిచ్చెన ఆట రసవత్తరంగా సాగింది. ఇంటి
- Author : Anshu
Date : 09-11-2022 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
బిగ్ బాస్ హౌస్ లో పదో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బాగా పాము నిచ్చెన ఆట రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యులందరూ రెండు టీఎంలుగా విడగొట్టిన బిగ్ బాస్ మట్టితో పాము, నిచ్చెన ను కట్టాలి అని ఆదేశించాడు. ఈ ఆటలో ఇనయా నిచ్చెన టీమ్ సంచాలక్ గా ప్రకటించారు. అలాగే పాముల టీం సంచాలక్ గా ఫైమాను ప్రకటించారు. రెండు టీమ్ ల వారు బంక మట్టిని సంపాదించి పాముని నిచ్చెన ను తయారు చేయాలి. తర్వాత సమయానుసారం ఒక టీం సభ్యుడు మరొక టీంలో తనకు ఇష్టమైన సభ్యుడిని ఎంచుకొని వారి నుంచి బంక మట్టిని తీసుకునే ప్రయత్నం చేయాలి.
అలా కొందరు కంటెస్టెంట్ లు అవతలి టీం కంటెస్టెంట్ నుంచి బంక మట్టిని దొంగతనం చేశారు. టాస్క్ చివర్లో కాసేపట్లో ముగుస్తుందని, ఇరుటీమ్ సభ్యులు ఎవరు ఎవరి మట్టినైనా దొంగిలించొచ్చు అని బిగ్‌బాస్ చెప్పడంతో అంతా రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇనయా, ఫైమాల ఫైట్ హైలెట్‌గా నిలిచింది. ఇనయాను టార్గెట్ చేసిన ఫైమా,ప్రతిసారి ఆమె మట్టిని కొట్టేసేందుకే ప్రయత్నించింది. దీంతో ఇనయా శివంగిలా పోరాటం చేస్తూ ఫైమాను ఈడ్చి ఈడ్చి పడేసింది. అలాగే ఫైమా కట్టిన పాము నుంచి మట్టిని లాక్కునేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో ఇనయా, ఫైమాలు కిందపడి ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు. ఇనయా అయితే ఫైమా రెండు చేతులను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ఇనయా తప్పు చేస్తున్నావు.. చేయి విరిగిపోతుంది రేవంత్ చెప్పినా వినలేదు. ఒకరినొకరు అడ్డుకునే క్రమంలో ఇద్దరి దుస్తులు కూడా చిరిగిపోయాయి. అయినా ఎక్కడా తగ్గలేదు ఈ టాస్క్‌లో చివరివరకు ఒంటరి పోరాటం చేసినా ఇనయా.. తక్కువ మట్టి ఉన్న కారణంగా ఔట్ అయింది.