Bigg Boss Season 6: పాపం చంటి.. సీక్రెట్ టాస్క్ తో కెప్టెన్సీ రేసు నుంచి ఔట్?
తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో నాలుగవ వారం హోటల్ టాస్క్ జోరుగా సాగుతోంది. ఇక ఈ
- By Nakshatra Published Date - 05:02 PM, Thu - 29 September 22

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో నాలుగవ వారం హోటల్ టాస్క్ జోరుగా సాగుతోంది. ఇక ఈ హోటల్ టాస్క్ లో భాగంగా రెండు టీంలను విభజించిన బిగ్ బాస్, బీబీ హోటల్ స్టాఫ్ గా కొంతమందిని, గ్లామ్ పారడైజ్ హోటల్ స్టాఫ్ గా మరి కొంతమందిని నియమించాడు. కొంతమందిని గెస్ట్ లుగా నియమించారు. ఇక బేబీ హోటల్ మేనేజర్ అయిన సుదీప వాష్ రూమ్ కి వెళ్ళాలి అంటే 500 రూపాయలు ఇవ్వాలి అని కండిషన్ పెట్టడంతో అసలైన రచ్చ మొదలైంది.
ఇదే విషయం గురించి ఫైమా, సుదీప ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఈ హోటల్ టాస్క్ ముగిసింది. ఇక బిగ్ బాస్ హోటల్ సభ్యులను పిలిచి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పమని అడగగా బీబీ హోటల్ దగ్గర 4,600 ఉంటే, గ్లాం పారడైజ్ హోటల్ వారి దగ్గర 5300 ఉన్నాయి అని తెలిపారు హౌస్ సభ్యులు. దీంతో ఎక్కువ డబ్బులు ఉన్న గ్లామ్ పారడైజ్ సభ్యులు గెలిచినట్టు వెల్లడించారు బిగ్ బాస్. అలాగే గ్లామ్ ప్యారడైజ్ సభ్యుల ఆదిపత్యంలోకి బీబీ హోటల్ కూడా వస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు.
ఈ క్రమంలోనే బీబీ స్టాఫ్ నుంచి ముగ్గురు సభ్యులను మాత్రమే తమ టీమ్‌లోకి తీసుకొని,మిగిలిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేసి, పోటీదారుల నుంచి తొలగించొచ్చని చెప్పాడు. దీంతో రేవంత్, ఆదిత్యలను తొలగించి,సుదీప, గీతూ, మెరీనాలను తమ టీమ్‌లోకి తీసుకున్నారు. అనంతరం చలాకి చంటి కి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో విఫలమయ్యాడని చెబుతూ చంటీని కెప్టెన్సీ పోటీదారుల రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. దీంతో రేవంత్,ఆదిత్యలతో పాటు చంటీ కూడా కెప్టెన్ అయ్యే చాన్స్‌ని మిస్ అయ్యాడు.
Related News

Bigg Boss Winner: ‘బిగ్ బాస్ సీజన్ 6’ విన్నర్ అతడే!
తెలుగు బిగ్ బాస్ (Bigg boss) సీజన్ 6 ఎండింగ్ కు చేరుకుంది. విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది