Ashwini Sree : హీరోయిన్ గా మారుతున్న బిగ్‌బాస్ భామ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో..
బిగ్ బాస్ అశ్విని శ్రీ ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు దక్కించుకుంటుండగా ఏకంగా మెయిన్ లీడ్ గా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సెలెక్ట్ అవ్వడం గమనార్హం.
- Author : News Desk
Date : 06-04-2024 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
Ashwini Sree : నటి అశ్విని శ్రీ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. బిగ్ బాస్(Bigg Boss) లో ఎంటర్ అయి బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ తర్వాత కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ, షార్ట్ డ్రెస్సుల్లో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంది.
అశ్విని శ్రీ ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు దక్కించుకుంటుండగా ఏకంగా మెయిన్ లీడ్ గా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సెలెక్ట్ అవ్వడం గమనార్హం. అశ్విని శ్రీ మెయిన్ లీడ్ లో ‘మిస్ జానకి'(Miss Janaki) అనే సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఎన్ ఎన్ చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై నాగరాజు నెక్కంటి నిర్మాణంలో సతీష్ కుమార్ దర్శకత్వంలో ఈ మిస్ జానకి సినిమా తెరకెక్కబోతుంది. నేడు ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో అశ్విని శ్రీ తో పాటు చిత్రం శ్రీను, తనికెళ్ళ భరణి, అలీ, లోబో, బిగ్ బాస్ శాని.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 20 నుంచి నెల రోజుల పాటు రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుందని, ఆ తరువాత మరో షెడ్యూల్ ఉంటుందని మూవీ యూనిట్ తెలిపారు. మరి ఈ మిస్ జానకి అశ్విని శ్రీకి కలిసి వస్తుందా? అశ్వినికి మరిన్ని అవకాశాలు వస్తాయా చూడాలి.
Also Read : Brahmanandam : CSK Vs SRH మ్యాచ్‌లో మనవడితో బ్రహ్మి సందడి.. గచ్చిబౌలి దివాకర్ అంటూ మీమ్స్ వైరల్..