Rajamouli-Mahesh: క్రేజీ అప్ డేట్.. హాలీవుడ్ ను తలదన్నేలా రాజమౌళి-మహేశ్ మూవీ!
రాజమౌళి (Rajamouli) ఇప్పుడు గ్లోబల్ ఫినామినేషన్. ఆయన ఇప్పటికే అమెరికన్ నటీనటులతో RRR మూవీ చేశాడు.
- By Balu J Published Date - 05:52 PM, Thu - 16 March 23

రాజమౌళి (Rajamouli) ఇప్పుడు గ్లోబల్ ఫినామినేషన్. ఆయన ఇప్పటికే అమెరికన్ నటీనటులతో RRR మూవీ చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) చిత్రానికి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు కూడా. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరి ద్రుష్టి ఆకర్షించిన రాజమౌళి, ఆ మూవీని మరిపించేలా, హాలీవుడ్ ను తలదన్నేలా సినిమా కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ యాక్షన్ అడ్వంచర్ మూవీ కోసం వివిధ భాషల నటీమణులు, నటులు అవసరమని స్పష్టంగా తెలుస్తుంది.
RRR ఆస్కార్ ప్రచార ప్రక్రియలో లభించిన పాపులారిటీతో, మహేశ్ బాబు పక్కన టాప్ హాలీవుడ్ నటిని (Rajamouli) తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.అంతే కాదు సహా చాలా మంది టాప్ హాలీవుడ్ టెక్నీషియన్‌లను కూడా తీసుకోబోతున్నాడు. ఇక్కడ నిజంగా మహేష్ బాబు లక్కీ స్టార్. భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అనేక ఇతర భారతీయ తారలను అసూయపడేలా పాన్ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ పరంగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హాలీవుడ్ సినిమా తరహాలో ఈ చిత్రాన్ని గ్లోబల్ ప్రొడక్ట్‌గా మార్చే దిశగా రాజమౌళి (Rajamouli) కృషి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ దీపికాను తీసుకున్నట్టు కూడా టాక్ వినిపించింది.
Also Read: Nani on Rana Naidu: రానా నాయుడుపై నాని రియాక్షన్.. రానా కొత్తగా ట్రై చేశాడంటూ!

Related News

Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?
ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత.