Bholaa Shankar: చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా భోళాశంకర్, యూఎస్ లోనూ అంతంతమాత్రమే!
టీవల కాలంలో వచ్చిన డిజాస్టర్లలో భోళా శంకర్ ఒకటి అని చెప్పక తప్పదు.
- By Balu J Published Date - 12:42 PM, Mon - 14 August 23
మెగాస్టార్ చిరంజీవికి “ఆచార్య”తో సహా చాలా ఫ్లాప్‌లు ఉన్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన “భోళా శంకర్” నిరాశపర్చింది. సాధారణంగా అమెరికన్ ప్రేక్షకులు చిరు మూవీస్ ను బాగానే చూస్తారు. కానీ భోళా విషయంలో నో చెప్పారు. “ఆచార్య” డిజాస్టర్ అయినప్పటికీ $985k సంపాదించింది.. “గాడ్ ఫాదర్” రీమేక్ మూవీని కూడా ఆదరించారు. బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ($1,283,527) వసూలు చేసింది. అయితే, “భోళా శంకర్” దాని మొత్తం రన్లో హాఫ్ మిలియన్ డాలర్లు కూడా సంపాదించకపోవచ్చు.
మొదటి ఆదివారం, ఈ చిత్రం $15k మాత్రమే వసూలు చేసింది. ప్రేక్షకులు ఎలా తిరస్కరించారో కలెక్షన్లే చెబుతున్నాయి. చిన్న-బడ్జెట్ సినిమాలు కూడా మొదటి ఆదివారం కంటే ఎక్కువ వసూళ్లు చేస్తాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన “భోళా శంకర్” ప్రీమియర్ రోజున $303k వసూలు చేసింది. నెగిటివ్ పబ్లిక్ టాక్ వినిపించడంతో చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఇటీవల కాలంలో వచ్చిన టాలీవుడ్ డిజాస్టర్లలో ఇదొక బాప్ గా నిలిచిపోయిందని అంటున్నారు సినీ క్రిటిక్స్.
భోళా శంకర్ సినిమా 3వ రోజు కలెక్షన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. అతి కష్టం మీద 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీనితో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో కేవలం 40 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ లను మాత్రమే అందుకుంది. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం 40 కోట్లకు తగ్గకుండా గ్రాస్ ను అందుకునేవి. డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఆచార్య సైతం మూడు రోజుల్లో 45 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ భోళా శంకర్ సినిమా మాత్రం కేవలం 40కోట్లు మాత్రమే వసూలు చేసి.. అటు చిరంజీవికి, ఇటు నిర్మాతకు, ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.
Also Read: Traffic Restrictions: వాహనదారులు అలర్ట్, హైదరాబాద్ లో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!
Related News
Samantha: సమంత హాట్ స్టైలిష్ కలెక్షన్స్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ నటి సమంత మంచి నటి మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా