Bheemla Nayak: అదరగొట్టిన ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ బిజినెస్..!
- By HashtagU Desk Published Date - 09:55 AM, Mon - 21 February 22
ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. ఎట్టకేలకు ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ చిత్రం. మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. పవన్ కు ప్రత్యర్ది పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్లుగా నిత్య మీనన్, సంయుక్త మీనన్ నటించారు.
ఇకపోతే, ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ను నేడు( ఫిబ్రవరి 21న) విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ యూసఫ్ గుడలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీగా నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. అలానే మరోమంత్రి తలసాని కూడా అటెండ్ అవుతారు. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదలైన పాటలు, టీజర్లు సూపర్ హిట్ అవ్వడంతో… ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.
‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్:
నైజాం: 35.00cr
సీడెడ్: 17.00cr
ఉత్తరాంధ్ర: 9.50cr
ఈస్ట్ గోదావరి: 6.50cr
వెస్ట్ గోదావరి: 5.60cr
గుంటూరు:7.20cr
కృష్ణా: 6.00cr
నెల్లూరు: 3.20cr
ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ (టోటల్): 90.00cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 10.50cr
ఓవర్సీస్: 9.00cr
వరల్డ్ వైడ్ (టోటల్): 109.50cr
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ‘వకీల్ సాబ్’ తర్వాత వస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’ కావడంతో… ఈ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే… రూ.110 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. ఈ ఏడాది ఆరంభంలో రాబోతున్న పెద్ద సినిమాగా నిలిచింది ‘భీమ్లా నాయక్’. పవన్ సినిమా అంటేనే ఓ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయి. తన అట్టర్ ఫ్లాప్ మూవీలు కూడా రూ.50 కోట్ల షేర్ ను వసూలు చేసిన సందర్భాలు అనేకం. అలాంటిది ‘భీమ్లా నాయక్’ కు ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా.. టికెట్ ధరలతో సంబంధం లేకుండా ఈజీగా రూ.200 కోట్ల షేర్ ను రాబట్టే చాన్స్ ఉంది. మరోవైపు బాలీవుడ్ లోనూ నేరుగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. అక్కడ కూడా హిట్ టాక్ సాధిస్తే… కలెక్షన్స్ వీరలెవల్లో కుమ్మేయడం ఖాయం.
ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్ నెలకొంది. పవన్ అభిమానులు ఇప్పటినుంచే సందడి చేస్తున్నారు. నేడు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేస్తే… ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆపడం ఎవరి తరమూ కాదు. ‘భీమ్లా నాయక్’ కు ప్రస్తుతం ఉన్న హైప్ తో ఖచ్చితంగా రూ. 200 కోట్ల షేర్ ను కొల్లగొడుతుందనే అంచనాతో ఉన్నారు నిర్మాత నాగవంశీ. మరి విడుదల తర్వాత ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అన్నది వేచి చూడాలి.
Related News
AP : ఓటర్ల ప్రేమకు జనసేనాధినేత ఫిదా..
సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది