HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bheemla Nayak Pre Event Show On Monday

Bheemla Nayak: భీమ్లా నాయక్’ ట్రైలర్ ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'భీమ్లా నాయక్' కు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.

  • Author : Hashtag U Date : 20-02-2022 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bheemla Nayak Imresizer
Bheemla Nayak Imresizer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘భీమ్లా నాయక్’ కు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించగా… థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ నెల 25న విడుదల కానుంది ‘భీమ్లా నాయక్’. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లో ఫిబ్రవరి 24నే ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ లో పవన్ విశ్వరూపం కనిపించనుందని టాక్. ఫిబ్రవరి 21న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూసఫ్ గుడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారు. ఆయనతో పాటు మరోమంత్రి తలసాని కూడా అటెండ్ అవుతారు.

అయితే ‘భీమ్లా నాయక్’ నుంచి అదే రోజున ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. మరి ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ వేదికపై ఈ ట్రైలర్ ను విడుదల చేస్తారా…? లేదంటే అంతకంటే ముందుగానే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా కూడా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్ నెలకొంది అనడంలో అతిశయోక్తి లేదు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఫిబ్రవరి 25 ఎప్పుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ పై హైప్ మామూలుగా క్రియేట్ కాలేదు. ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని టాక్. మరోవైపు యూఎస్ లో 400 పైచిలుకు థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల కాబోతోంది. అక్కడ ఇప్పటికే ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వీర లెవల్ లో టికెట్స్ తెగుతున్నాయి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి అమెరికాలో ప్రీమియర్స్ షో బుకింగ్స్ ద్వారానే రూ. కోటి పైన వసూలు చేసినట్లు సమాచారం. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అంటే…. అది పవన్ స్టామినాకు నిదర్శనంగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఇకపోతే పవన్ ‘భీమ్లా నాయక్’ తో పాత రికార్డులను చెరిపేయడం పక్కా అనే నమ్మకంతో ఆయన అభిమానులున్నారు. పవర్ స్టార్ ఈ చిత్రంలో తనకి ఎంతో ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేసిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ‘భీమ్లా నాయక్’ లో మరో ప్రధానమైన పాత్రను రానా దగ్గుబాటి పోషించారు. హీరోయిన్లుగా నిత్యామీనన్ – సంయుక్త మీనన్ కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheemla Nayak
  • Pawan Kalyan
  • pre event programme

Related News

Pawan Utad Promotion

ప్రమోషన్ కు పవన్ వస్తున్నాడు..ఇక ఉస్తాద్ కు తిరుగులేదు !!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సినిమా షూటింగ్‌లకే డేట్లు ఇవ్వడం కష్టమనుకుంటున్న తరుణంలో, ప్రమోషన్ల కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించడం విశేషం

    Latest News

    • Train Journey : జస్ట్ 2 గంటల్లో బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం

    • Konda Murali : కొమ్మాల వేదికగా కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు !! నెక్స్ట్ ఏం జరగబోతుందో ?

    • గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తినొచ్చా?

    • అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం

    • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

    Trending News

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

      • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

      • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

      • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

      • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd