Bhairavam : ‘భైరవం’ ట్రైలర్ చూశారా? ముగ్గురు హీరోల యాక్షన్ సినిమా..
ముగ్గురు హీరోలు యాక్షన్ తో అదరగొట్టిన 'భైరవం' ట్రైలర్ చూసేయండి..
- By News Desk Published Date - 10:13 AM, Mon - 19 May 25

Bhairavam : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోలు కలిసి భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘భైరవం’. ఈ సినిమాలో నారా రోహిత్ కి జంటగా దివ్య పిళ్ళై, శ్రీనివాస్ జోడిగా అదితి శంకర్, మనోజ్ జోడిగా ఆనంది.. ఇలా ముగ్గురు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. జయసుధ, సందీప్ రాజ్, అజయ్, అజయ్ ఘోష్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భైరవం సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మాణంలో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఏలూరులో భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే ముగ్గురు హీరోలు అన్నదమ్ములు, ఓ గుడిని, గుడి ఆస్తిని కాపాడుకుంటూ వస్తారని, ఆ గుడి ఆస్తిపై విలన్ కన్ను పడటం, దాని కోసం గొడవలు, చివరకు అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం.. అన్నట్టు చూపించారు. ముగ్గురు హీరోలు ఓ రేంజ్ లో యాక్షన్ చేసారు, చాలానే ఫైట్ సీక్వెన్స్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా మే 30న రిలీజ్ కానుంది.
మీరు కూడా ముగ్గురు హీరోలు యాక్షన్ తో అదరగొట్టిన ‘భైరవం’ ట్రైలర్ చూసేయండి..
Also Read : Nandi Awards : ఏపీలో నంది అవార్డులు.. సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటన..