Brahmani : బాలయ్య కూతురు బ్రాహ్మణికి హీరోయిన్ ఆఫర్ ఇచ్చిన మణిరత్నం.. కానీ..
బాలకృష్ణ కూతుళ్లు సినీ పరిశ్రమకు మొదట్నుంచి దూరంగా ఉన్నారు.
- By News Desk Published Date - 11:01 AM, Sat - 4 January 25

Brahmani : చాలా మంది సీనియర్ హీరోల కొడుకులే కాదు కూతుళ్లు కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. అందరూ హీరోయిన్స్ కాకపోయినా సినీ పరిశ్రమలో ఏదో ఒక విభాగంలో పనిచేస్తున్నారు. రజినీకాంత్ కూతుళ్ళు దర్శక నిర్మాతలు, కమల్ హాసన్ కూతుళ్లు హీరోయిన్స్, చిరంజీవి కూతురు నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్, మోహన్ బాబు కూతురు నటి, నాగబాబు కూతురు హీరోయిన్, నిర్మాత.. ఇలా చాలా మంది సీనియర్ నటుల కూతుళ్లు సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు.
కానీ బాలకృష్ణ కూతుళ్లు సినీ పరిశ్రమకు మొదట్నుంచి దూరంగా ఉన్నారు. ఇటీవలే చిన్నకూతురు తేజస్విని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. అది కూడా స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి. తాజాగా ఈ విషయాన్ని బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తెలిపారు. ఆహా ఓటీటీలో వస్తున్న బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 నుంచి తాజాగా నిన్న రాత్రి కొత్త ఎపిసోడ్ రిలీజయింది. ఈ ఎపిసోడ్ కి నిర్మాత నాగవంశీ, తమన్, డైరెక్టర్ బాబీ వచ్చారు.
ఈ ఎపిసోడ్ లో తమన్ అడిగిన ఓ ప్రశ్నకు బాలయ్య సమాధానమిస్తూ.. నా కూతుళ్ళని చక్కగా పెంచాను. డైరెక్టర్ మణిరత్నం గతంలో బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. కానీ బ్రాహ్మణికి నటన ఇంట్రెస్ట్ లేదని రిజెక్ట్ చేసింది. చిన్న కూతురు తేజస్విని మాత్రం చిన్నప్పుడు ఇంట్లో అద్దం ముందు నటించేది. తను నటనలోకి వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు. ఇప్పుడు నిర్మాతగా, ఈ షోకి కంటెంట్ టీమ్ లో పనిచేస్తుంది. నా కూతుళ్లు ఇద్దరూ వాళ్ళ రంగాల్లో రాణించడం నాకు గర్వకారణం అని అన్నారు.
Also Read : Chiranjeevi : అభిమాని కోరిక తీర్చిన మెగాస్టార్.. పారా ఒలంపిక్ విజేతకు ఆర్ధిక సాయం..