Balakrishna : నోరు జారలేదు..వక్రీకరించారు! చింతిస్తున్నా..మీ బాలయ్య.!
హీరో బాలక్రిష్ణ(Balakrishna) మరోసారి నోరు జారి, క్షమాపణ చెప్పుకున్నారు.
- By CS Rao Published Date - 04:09 PM, Mon - 6 February 23

అన్ స్టాపబుల్ సీజన్ 2లో హీరో బాలక్రిష్ణ(Balakrishna) మరోసారి నోరు జారి, క్షమాపణ చెప్పుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్న షోలో నర్సులను(Nurse) కించపరిచేలా మాట్లాడారు. దీంతో వాళ్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ మాటలకు చింతిస్తున్నానని క్షమాపణ కోరడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన మాట తూలారు. ఇటీవల రెండు వారాల క్రితం `అక్కినేని..తొక్కినేని` అంటూ కామెంట్స్ చేసి అక్కినేని హీరోలకు జలక్ ఇచ్చారు. వారం పాటు ట్వీట్టర్ వేదికగా, మీడియా వేదికగా ఆ వివాదం నడిచింది. అదే సందర్భంగా `ఆ రంగారావు ఈ రంగారావు` అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు లోకేష్ పాదయాత్రపై కాపు సామాజికవర్గం వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లింది.
అన్ స్టాపబుల్ సీజన్ 2లో హీరో బాలక్రిష్ణ(Balakrishna)
కాపు సంఘాల నేతలు అల్టిమేటం ఇచ్చారు. బాలక్రిష్ణ (Balakrishna) క్షమాపణకు జనవరి 25వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఒక వేళ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ ఇష్యూపై బాలక్రిష్ణ అనంతపురంలో జరిగిన `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్‌లో మాట్లాడారు. ఒక రకంగా వివరణ ఇస్తూ `తాడే పేడో..`అంటే అర్థం ఏమిటి అంటూ ప్రశ్నించారు. అంటే, యథాలాపంగా మాట్లాడాను మినహా ఎవర్నీ కించపరచలేదని, అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంత అభిమానమో చాటుకున్నారు. అంతటితో ఆ వివాదం ముగిసిపోయింది. దాన్ని మరవకముందే `దా+++మ్మ నర్సు`(Nurse) అంటూ ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను అన్ స్టాపబుల్ ఫోలో పవన్ తో షేర్ చేసుకున్నారు.
Also Read : Nandamuri Balakrishna: ANRను అవమానించలేదు.. అవన్నీ యాదృచ్చికంగా వచ్చిన మాటలే!
సాధారణంగా బాలక్రిష్ణ అప్పుడప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు యాదృశ్చికంగా చేస్తుంటారు. ఆయన మాటలను తూలుడం సర్వసాధారణం. ఎందుకు అలా ఆయన మాట్లాడతారు? ఏ ఉద్దేశంతో నోరు జారతారు? అనేది సన్నిహితులకు కూడా తెలియదు. ఆ తరహాలోనే వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో అసందర్భంగా `అక్కినేని..తొక్కినేని..ఆ రంగారావు..ఈ రంగారావు` అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్ ను జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా హైలెట్ చేసింది. దానికి తోడుగా కాపు సంఘాలు, అక్కినేని కుటుంబం, అభిమానులు రంగంలోకి దిగారు. దీంతో సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజులు రచ్చ జరిగింది.
వైసీపీ సోషల్ మీడియా ఆయన మైండ్ సెట్ గురించి..
గతంలో బాలక్రిష్ణ(Balakrishna)చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ లోని కొందరు గుర్తు చేస్తున్నారు. `అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి…కడుపు చేయాలి` అంటూ గతంలో బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలను చేసి వివాదస్పదం అయ్యారు. అంతేకాదు, జనసేన పార్టీ గురించి `సంకర జాతి..అలగాజనం` అంటూ ఆ మధ్య చేసిన కామెంట్స్ ను ఆ పార్టీ మరువలేకపోతోంది. తాజాగా ` విశ్వ బ్రాహ్మణులు..రావణ సంతానం` అంటూ నోరుజారి వాళ్లకు క్షమాపణ చెప్పారు. వీటన్నింటినీ గుర్తు చేస్తోన్న వైసీపీ సోషల్ మీడియా ఆయన మైండ్ సెట్ గురించి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలు పెట్టారు.
మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం
ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా పేర్కొనడం గమనార్హం. నర్సులను కించపరిచానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఖండిస్తున్నానని బాలయ్య అన్నారు. రోగులకు సేవలు అందించే నర్సు (Nurse)సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని బాలకృష్ణ స్పష్టం చేశారు.`బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలు అందించారు. అటువంటి నర్సులను(Nurse) మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను” అంటూ నర్సులకు వివరణ ఇచ్చారు హీరో బాలక్రిష్ణ.
Also Read : Telugu Film :టాలీవుడ్ లో జగన్మోహన్ రెడ్డి చిచ్చు! చిరు, బాలయ్య సినిమాల వార్!
ఏదో ఒక సందర్భంలో నోరు జారడమో, చేయి ఆడించడమో చేసే బాలయ్య తరచూ వివాదస్పదం అవుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఇష్యూ కూడా పెద్దగా సీరియస్ కాలేదు. ఇదే పోకడను ఆయన కొనసాగిస్తే ఏదో ఒక రోజు మరింత సీరియస్ అయ్యే అవకాశం లేదు. ఆ విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన అభిమానుల ఉవాచ. ఆ విషయాన్ని నేరుగా ఆయనకు చెప్పడానికి సాహసం చేయలేని ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారట.

Related News

TDP Radio : మోడీ `మన్ కీ బాత్` తరహాలో రేడియో ద్వారా చంద్రబాబు వాయిస్
ప్రధాని నరేంద్ర మోడీ `మన్ కీ బాత్` తరహాలో చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా రేడియో(TDP Radio)