Balakrishna – Vishwak Sen : బాలయ్య, విశ్వక్ సేన్ కాంబోలో వెబ్ సిరీస్..!
బాలయ్య, విశ్వక్ సేన్ కాంబోలో ఒక వెబ్ సిరీస్ రాబోతోందా..? 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ..
- Author : News Desk
Date : 29-05-2024 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
Balakrishna – Vishwak Sen : గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇక ఈ ఫ్రెండ్ షిప్ తో ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు అటెండ్ అవుతూ సందడి చేస్తూ వస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యి సందడి చేసారు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ.. ఫ్లూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
వీరిద్దరి బంధం చూసిన ఇరువురి అభిమానులు.. వీరిద్దరితో ఒక మల్టీస్టారర్ వస్తే బాగుండు అని ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ఈ విషయం గురించే ఒక చిన్న హింట్ ఇచ్చారు. బాలయ్య బాబు మాట్లాడుతూ.. “త్వరలో నేను విశ్వక్ సేన్ కలిసి ఒక మంచి కాంబో అనౌన్స్ చేయబోతున్నాము. అది డిజిటల్ లో ఉండబోతుంది” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
#Balakrishna & #VishwakSen combo 💥🤩✅
WebSeries or Movie? 🙃 pic.twitter.com/2RGfygKccO
— Filmy Bowl (@FilmyBowl) May 28, 2024
ప్రెజెంట్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ వెబ్ సిరీస్ తో డిజిటల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, నాగచైతన్య, రానా దగ్గుబాటి వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించారు. హీరో రామ్ కూడా వెబ్ సిరీస్ తో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో బాలయ్య చేసిన ఈ కామెంట్స్.. వెబ్ సిరీస్‌నా..? అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. మరి బాలయ్య. విశ్వక్ కాంబోలో రాబోతున్న ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
కాగా వీరిద్దరూ ఇప్పటికే ఆహాలో హోస్ట్ గా చేస్తూ ఆడియన్స్ ని పలకరించారు. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ అంటే, విశ్వక్ సేన్ ‘ఫ్యామిలీ ధమాకా’ అంటూ ఆడియన్స్ ని అలరించారు.