Ashutosh Gowariker : గాయాలతో బెడ్‌పై పడుకునే సినిమా డైరెక్ట్ చేసిన దర్శకుడు..
ఆమిర్ నమ్మిన ఒక సినిమా ‘లగాన్’(Lagaan). 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి విజయ్ అందుకుందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అశుతోష్ గోవారికర్(Ashutosh Gowariker)డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూలింగ్ పీరియడ్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
- Author : News Desk
Date : 04-11-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్(Bollywood) మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్(Aamir Khan) ప్రయోగాలు చేయడానికి ముందు ఉంటాడు. ఎంత కష్టమైనా, ఎంత రిస్క్ ఉన్నా ఒకసారి కథని నమ్మితే.. దానికోసం తానే అన్ని అయ్యి ముందుకు తీసుకు వెళ్తాడు. ఇలా ఆమిర్ నమ్మిన ఒక సినిమా ‘లగాన్’(Lagaan). 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి విజయ్ అందుకుందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అశుతోష్ గోవారికర్(Ashutosh Gowariker)డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూలింగ్ పీరియడ్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అశుతోష్ గోవారికర్ ఈ సినిమా కథని రాసుకున్న తరువాత చాలామంది నిర్మాతలకు వినిపించాడట. అయితే ప్రతి ఒక్కరు స్టోరీ బాగుంది అంటున్నారు గాని.. నిర్మించడానికి భయపడుతున్నారు. మేము ఈ సినిమా ప్రొడ్యూస్ చేయలేము అని అశుతోష్ మొహం మీదే చెప్పేస్తున్నారట. ఇక ఈ కథ విన్న ఆమిర్.. నమ్మకంతో తానే నిర్మాతగా మారి ‘ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్’ స్థాపించి మొదటి సినిమాగా లగాన్ నిర్మించాడు. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 65 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ఆమిర్ నమ్మకాన్ని నిలబెట్టడానికి దర్శకుడు అశుతోష్ పడిన కష్టం అయితే అంతాఇంతా కాదు. ఒక సమయంలో షూటింగ్ లో తీవ్ర గాయాలు పాలయ్యాడు. కొన్ని రోజులు పాటు బెడ్ పై నుండి లేవలేని పరిస్థితి. అయినా గోవారికర్ సినిమా ఆగకూడదని.. షూటింగ్ సెట్స్ లో తన మానిటర్ పక్కన ఒక బెడ్ వేయించుకొని చిత్రీకరణ చేశాడట. అశుతోష్ కష్టం, ఆమిర్ నమ్మకం ఈ సినిమాకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను తెచ్చిపెట్టింది. అంతేకాదు ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్ లో స్థానం దక్కించుకున్న చిత్రంగా కూడా నిలిచింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మన దేశంలోని ఒక గ్రామం ప్రజలు మూడేళ్ల పన్ను మినహాయింపు పొందడం కోసం బ్రిటిష్ వాళ్ళతో క్రికెట్ పందానికి దిగుతారు. అసలు క్రికెట్ అంటే కూడా తెలియని ఆ గ్రామస్థలు ఎలా విజయం సాధించారు అనేది లగాన్ కథ.
Also Read : Krishnam Vande Jagadgurum : మూడు కథలను కలిపి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తీసిన క్రిష్..