Animal Collections : 900 కోట్ల వైపు పరుగులు తీస్తున్న యానిమల్
- Author : Sudheer
Date : 17-12-2023 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన యానిమల్ (Animal) మూవీ..1000 కోట్లు రాబట్టేలా ఉంది. డిసెంబర్ 01 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అన్ని భాషల్లో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 817 కోట్ల 36 లక్షల ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
సాధారణంగా ఏ మూవీ యూనిట్ ఐన తమ సినిమా సినిమా కల్లెక్షన్లను అనౌన్స్ చేయడం అనేది కామనే. కానీ యానిమల్ సినిమా యూనిట్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎవరైతే ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఎవరైతే ఇచ్చారో ఆ రివ్యూ ట్వీట్ దగ్గరకు వెళ్లి ఆ ట్వీట్ ను టాగ్ చేస్తూ యానిమల్ సినిమా 817 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ‘యానిమల్’ మూవీ ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు దీన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.
Read Also : Bigg Boss Telugu7: శివాజీకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్