Animal Collections : యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్
ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 116 కోట్లు వసూళు చేసింది
- Author : Sudheer
Date : 02-12-2023 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన యానిమల్ ( (Animal)) మూవీ డిసెంబర్ 01 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు హిట్ టాక్ రావడమే కాదు ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 116 కోట్లు వసూళు చేసింది. ఒక్క ఇండియా లోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రెడ్ వర్గాలు చెపుతున్నాయి. ‘యానిమల్’ మూవీ హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో… ఓవర్సీస్ మార్కెట్ కూడా కలిపితే మొత్తంగా మరో రూ. 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు అందుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ జోరు చూస్తుంటే రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్ ను ఈ వీకెండ్ లో ఈజీగా దాటేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక ‘యానిమల్’ మూవీ ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు దీన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.
Read Also : Cyclone Michaung: మైచాంగ్ తుఫాను ఎఫెక్ట్.. తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..?!