Anasuya : స్లీవ్‌లెస్ జాకెట్ లో అనసూయ..చూస్తే మతి పోవాల్సిందే !!
Anasuya : 40 ఏళ్ల వయస్సులోనూ తన ఫిజిక్ మెయిన్‌టైన్ చేస్తూ, యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది అనసూయ.
- By Sudheer Published Date - 11:18 AM, Fri - 27 June 25

బుల్లితెర పై న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ (Anasuya ), తర్వాత యాంకర్‌గా మారి జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అక్కడినుంచి ఆమెకు సినీ అవకాశాలు రావడం ప్రారంభమై ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘విమానం’, ‘కిలాడి’ వంటి హిట్ చిత్రాల్లో నటించి, తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆమె అభినయం ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. యాంకర్ గానే కాకుండా, ఒక మంచి నటి అని అనసూయ నిరూపించుకుంది.
Phone Tapping : నేడు సిట్ ముందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
ఇక సోషల్ మీడియాలోను అనసూయ హవా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిలియన్లలో అభిమానులు ఉన్న ఆమె, తరచూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. 40 ఏళ్ల వయస్సులోనూ తన ఫిజిక్ మెయిన్‌టైన్ చేస్తూ, యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది అనసూయ. సంప్రదాయ చీరకట్టులోనూ, మోడ్రన్ వెస్టర్న్ లుక్‌లలోనూ సమానంగా ఆకట్టుకునే శైలికి ఆమెకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ధరించిన నలుపు రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్ డిజైన్ నెటిజన్లను కట్టిపడేసింది.
ఈ ఫొటోల్లో అనసూయ స్టైల్ అబ్బా అనిపిస్తుంది. స్లీవ్‌లెస్ డిజైన్‌తో తన అందాన్ని మరింత హైలైట్ చేస్తూ, సంప్రదాయ చీరలో కూడా మోడ్రన్ టచ్‌ను కలగజేసింది. అనసూయ పోస్ట్ చేసిన తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె అందంపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా?” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.