Anasuya : చెప్పు తెగుద్ది అంటూ పబ్లిక్ గా యువకుడికి వార్నింగ్ ఇచ్చిన అనసూయ..అసలు ఏంజరిగిందంటే !!
Anasuya : "చెప్పు తెగుద్ది" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలంటూ మీ ఇంట్లో మీకు నేర్పలేదా?"
- By Sudheer Published Date - 03:44 PM, Sat - 2 August 25

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ (Anasuya) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కొందరు యువకులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించి, పబ్లిక్ గా వారికి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అనసూయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్టేజీపై ప్రసంగిస్తుండగా, ప్రేక్షకుల మధ్య ఉన్న కొందరు యువకులు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనసూయ, “చెప్పు తెగుద్ది” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలంటూ మీ ఇంట్లో మీకు నేర్పలేదా?” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Tasty Pickles : ఇంట్లోనే రుచికరమైన ఊరగాయలు తయారుచేసుకోవడంలో కొత్త ట్రెండ్..ఆరోగ్యానికి ఎన్ని లాభాలో!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ తీరుపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. “అలానే బుద్ధి చెప్పాలి” అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించేవారికి ఇది ఒక గుణపాఠం కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, సామాజిక అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తుంటారు. గతంలోనూ నెటిజన్లు చేసిన అసభ్య కామెంట్లపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. అలాగే, పలు ఈవెంట్లలోనూ ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మహిళలను గౌరవించాలని, బహిరంగ ప్రదేశాల్లో మర్యాదగా ప్రవర్తించాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తుంది.
చెప్పుతో కొడతానంటూ యువకులకు వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అసభ్యకర కామెంట్స్ చేశారని యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ#Anasuyabharadwaj pic.twitter.com/QWH1ha88Gf
— 🦁 (@TEAM_CBN1) August 2, 2025