Baby Combination Duet : బేబీ కాంబో డ్యుయెట్ చేస్తున్నారు..!
Baby Combination Duet ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బేబీ సినిమా బాక్సాఫీస్ దగ్గర
- Author : Ramesh
Date : 09-10-2023 - 3:57 IST
Published By : Hashtagu Telugu Desk
Baby Combination Duet ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బేబీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ బేబీ భారీ వసూళ్లను రాబట్టింది. బేబీ తర్వాత వైష్ణవి చైతన్య, ఆనంద్ (Anand Devarakonda) లకు క్రేజ్ పెరిగింది. అందుకే ఇద్దరు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో బేబీ (Baby) కాంబోని రిపీట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. మిథున్ అనే నూతన దర్శకుడు డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఇద్దరు కలిసి మరో సినిమా చేస్తున్నారు. బేబీ సూపర్ హిట్ కాబట్టి వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను కూడా ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
Also Read : Sai Dharam Tej : మెగా మేనల్లుడు ఆ టైటిల్ కి ఫిక్స్..!
బేబీ లా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కాకుండా డిఫరెంట్ స్టోరీతో ఈ Duet సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు డ్యుయెట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ డ్యుయెట్ కూడా బేబీ రేంజ్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. బేబీ కాంబో సినిమా అంటే యూత్ ఆడియన్స్ ఈజీగా ఆ సినిమాకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి వీళ్ల డ్యుయెట్ ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join