Amardeep Chowdary: నేనొక్కడినే ఉన్నప్పుడు రండి చూసుకుందాం
బిగ్ బాస్ సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా అమర్‌దీప్ రన్నరప్ గా నిలిచారు. హౌస్‌లో పూర్తిగా దూకుడుగా కనిపించిన అమర్ ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఆయన కారుపై అనూహ్య దాడి జరగడం ఆయన అభిమానులను షాక్‌కు గురి చేసింది
- Author : Praveen Aluthuru
Date : 19-12-2023 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
Amardeep Chowdary: బిగ్ బాస్ సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా అమర్‌దీప్ రన్నరప్ గా నిలిచారు. హౌస్‌లో పూర్తిగా దూకుడుగా కనిపించిన అమర్ ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఆయన కారుపై అనూహ్య దాడి జరగడం ఆయన అభిమానులను షాక్‌కు గురి చేసింది. స్టూడియో వెలుపల రాళ్ల దాడితో అమర్ కుటుంబం మరియు అభిమానులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై అమర్‌దీప్ తొలిసారి మాట్లాడాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు.
అందరికీ నమస్కారం..రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. నన్ను మీలో ఒకడిలా చూసారు. రాళ్లదాడిని ప్రస్తావిస్తూ.. కారు అద్దాలు పగలగొట్టి.. బయటకు రా.. నీ అంతు చూస్తాం అంటూ కొందరు బెదిరించారు. అయితే నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. నాకు భయం లేదు. నేను ఎవరికీ భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మా ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య కూడా ఉన్నారు. వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం. కారు అద్దం పగలడంతో ఆ గాజు పెంకులన్నీ మా అమ్మ, భార్య తేజుపై పడ్డాయి. ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. రాళ్లదాడి కారణంగా ఏదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలా ఎవరికీ జరగకూడదు. ఇంకెప్పుడూ ఇలా చేయవద్దు. నా అభిమాన హీరో మాస్ మహారాజా రవితేజ వచ్చి నాకు సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పుడే నేను గెలిచాను అని చెప్పారు.
Also Read: Gandhi Hospital: కరోనా వేరియంట్ JN.1 ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రి సిద్ధం