Bollywood Movies Leaked: బాలీవుడ్ మూవీలకు ‘పైరసీ’ దెబ్బ
ఇప్పటికే రాకీ భాయ్ కేజీఎఫ్-2 దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది.
- By Hashtag U Published Date - 05:31 PM, Sun - 1 May 22
ఇప్పటికే రాకీ భాయ్ కేజీఎఫ్-2 దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. అజయ్ దేవగన్ నటించిన “runway 34” , టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన “heropanti” సినిమాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ఏప్రిల్ 29నే థియేటర్లలో విడుదలయ్యాయి. వీటి కెమెరా ప్రింట్ ను తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ అనే మూవీ పైరసీ వెబ్ సైట్లు అప్ లోడ్ చేశాయి. టొరెంట్ లోనూ దీన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు. దీంతో ఈ సినిమాలకు కలెక్షన్స్ పడిపోయాయి. రిలీజ్ తర్వాతి రెండో రోజైన ఆదివారం కూడా కలెక్షన్స్ అంతంతే జరిగాయి. ఒకవైపు సౌత్ ఇండియా సినిమాల సత్తాను తట్టుకోలేక పోతున్న బాలీవుడ్ కు పైరసీ పెద్ద సవాల్ గా మారింది.
Related News
Bollywood: లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథతో బాలీవుడ్ మూవీ!
Bollywood: ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్బాల్ క్రీడలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్. ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీని తెరకెక్కుతోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆదర్శవంతమైన ఈ స్పోర్ట్స్ బ�