HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Aghori Performs Special Pujas For Pawan Kalyans Son

Mark Shankar Health : పవన్ కళ్యాణ్ కుమారుడి కోసం అఘోరి ప్రత్యేక పూజలు

Mark Shankar Health : లేడీ అఘోరి, మార్క్ శంకర్ ఆరోగ్యం కోలుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు

  • Author : Sudheer Date : 09-04-2025 - 8:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mark Shankar Lady Aghori
Mark Shankar Lady Aghori

సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రైవేట్ స్కూల్‌లో అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో శంకర్ చేతులు మరియు కళ్లకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషాదకర వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తక్షణమే విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరియు ఆయన భార్య సురేఖ కూడా తక్షణమే సింగపూర్‌కు చేరుకున్నారు. మార్క్ శంకర్‌ను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించి, ప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Aryan Khan : షారుక్ ఖాన్ వారసుడి కెరీర్ షురూ.. వెబ్ సిరీస్ వస్తోంది

ఈ ఘటనపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో అనేక మంది ప్రార్థనలు చేస్తూ పోస్ట్‌లు చేస్తూ తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి విడుదలైన తాజా ఫోటోలో మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది అభిమానులకు కొంత ఊరటను కలిగించింది. పవన్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు సాధారణ గదికి షిఫ్ట్ అయినట్టు తెలిపారు. అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని అన్నారు.

ఈ నేపథ్యంలో లేడీ అఘోరి, మార్క్ శంకర్ ఆరోగ్యం కోలుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. “పవన్ కళ్యాణ్ గారు, మీరు బాధపడకండి. మీ కుమారుడు మళ్లీ నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. నా వంతుగా నేను పూజలో కూర్చొంటున్నాను. మీరు సనాతన ధర్మం కోసం పోరాటం కొనసాగించండి” అంటూ ఆ అఘోరి హృదయపూర్వకంగా వెల్లడించాడు. ఇది చూసిన పవన్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. పాపం చిన్నారి మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తాడని అందరూ ఆశిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lady Aghori
  • Mark Shankar
  • Mark Shankar Health
  • Pawan Kalyan
  • Pawan son
  • Pawan son health

Related News

Pawan Praises Modi's Leader

Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd