KGF 2: ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్న ‘కేజీఎఫ్’
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ భారతదేశం అంతటా అనేక నగరాలను పర్యటిస్తూ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అన్ని ఈవెంట్లలో విధిగా పాల్గొంటున్నారు
- By Balu J Published Date - 11:06 AM, Tue - 22 March 22
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ భారతదేశం అంతటా అనేక నగరాలను పర్యటిస్తూ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అన్ని ఈవెంట్లలో విధిగా పాల్గొంటున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా కాబట్టి చిత్రానికి పెద్ద ఓపెనింగ్స్ రావాలి. అయితే “RRR” తర్వాత థియేటర్లలోకి రాబోతున్న తదుపరి పెద్ద చిత్రం కన్నడ సూపర్ స్టార్ యష్ “KGF 2”. మేకర్స్ ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. ఈ చిత్రంలోని మొదటి పాట “తూఫాన్” సోమవారం విడుదలైంది. పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ మార్చి 27 న నిర్వహించబడుతుంది. బెంగుళూరులో యష్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికారిక ప్రచార కార్యక్రమాలను ఆరోజు నుంచే ప్రారంభించే అవకాశాలున్నాయి.
“RRR” విడుదలయిన తర్వాతనే టీమ్ ప్రమోషన్ల జోరు పెంచనుంది. “KGF చాప్టర్ 2” కూడా “RRR” తరహాలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టనుంది. కాబట్టి ఈ టీమ్ “RRR” ప్రమోషన్లకు క్లాష్ కాకుండా ఉండేందుకు అడుగులు వేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ ఛాపర్ట్ 1 కు సీక్వెల్ ఇది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇదొకటి. అయితే రాజమౌళి సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. ప్రమోషన్లకు అంతకంటే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వరుసగా ఈవెంట్స్ నిర్వహిస్తూ.. ఆర్ఆర్ఆర్ జనాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జక్కన మాదిరిగా కేజీఎఫ్ టీం కూడా భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే!
Related News
Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ నెల అనగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎంత�