Advance B’day Wishes From Mega Star: పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్‌గా బర్త్ డే విషెస్ : మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్ లో శనివారం రాత్రి జరిగిన'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపైన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి అడ్వాన్స్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు.
- By Hashtag U Published Date - 11:55 PM, Wed - 31 August 22

హైదరాబాద్ లో శనివారం రాత్రి జరిగిన’ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపైన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి అడ్వాన్స్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సెప్టెంబరు 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈ వెంట్ చివరలో మెగాస్టార్ చిరంజీవి ‘‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు ఈ సినిమా విడుదలయ్యే రోజు(సెప్టెంబరు 2) మా తమ్మడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ముందస్తుగా మీ అందరి సమక్షంలో మా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ’’ అని చెప్పారు. ఈవెంట్ కు హాజరైన యువత, పిల్లలు పెద్దగా అరుస్తూ కేరింతలు కొట్టారు.
అంతకు ముందు చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి కష్టపడితే పైకొస్తారని చెప్పారు. ఇండస్ట్రీని లైట్‌గా తీసుకుంటే ఎంత వేగంగా పైకొచ్చారో అంతే వేగంగా వెనక్కి పోతారని హెచ్చరించారు.కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారన్నారు. యువ దర్శకులు కంటెంట్ పై ఎక్కువ దృష్టి సారించాలని సలహా ఇచ్చారు. కంటెంట్ సరిగా లేక తన సినిమా ఫ్లాప్ అయిందని చెప్పారు. దర్శకులపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయన్నారు. సినిమాను గట్టెక్కించడంలో దర్శకుడిదే ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు. డేట్స్ ల్యాప్స్ అవుతాయని హడావిడిగా సినిమాలు తీయొద్దని సూచించారు. ప్రేక్షకులు థియేటర్ లకు రావడంలేదనేది అపోహ మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ అందించిన కథతో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీకాంత్‌రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకురానుంది.