Actor Vikram Hospitalized : అస్వస్ధతతో హాస్పిటల్‌లో చేరిన హీరో విక్రమ్
కోలీవుడ్ చిత్ర పరిశ్రమ షాకయ్యే సంఘటన జరిగింది. స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు ఛాతీలో నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆయనను చెన్నై కావేరీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
- By Hashtag U Published Date - 03:30 PM, Fri - 8 July 22

కోలీవుడ్ చిత్ర పరిశ్రమ షాకయ్యే సంఘటన జరిగింది. స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు ఛాతీలో నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆయనను చెన్నై కావేరీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన తాజాగా ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. నిజానికి ఆయనకి గుండె పోటు రాలేదని, హైఫీవర్ తో బాధపడుతున్నారని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. ఇప్పటికే కరోనా బారినపడి విక్రమ్ ఈ మధ్యనే కోలుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంచ్‌కు విక్రమ్ హాజరు కావాల్సి ఉంది.. కేపి