Suhas: సోషల్ మీడియాలో ఎమోషనల్ లెటర్ షేర్ చేసిన సుహాస్.. ఇంకో హ్యాట్రిక్ ఇస్తారని నా ప్రయత్నం అంటూ?
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుహాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న
- By Anshu Published Date - 10:01 AM, Sat - 10 February 24

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుహాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. కలర్ ఫోటో సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న సుహాస్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల తండ్రిగా కూడా ప్రమోషన్ ను పొందిన విషయం తెలిసిందే. ఇటీవలే సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల పలకరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
సుహాస్ మరోసారి నటుడిగా ప్రూవ్ చేసుకొని హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమా ఇప్పటికే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా హిట్ అయినందుకు, వరుసగా మూడు సినిమాల హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఒక ఎమోషనల్ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సుహాస్. ఈ లెటర్ లో సుహాస్ ఈ విధంగా రాసుకొచ్చాడు.. అందరికి నమస్కారం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాని మేము అనుకున్నట్లుగా ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ కి కామెంట్స్ పెట్టడం దగ్గరనుంచి ఇప్పుడు బుక్ మై షోలో టికెట్స్ కొనే వరకు, నన్ను దగ్గరికి తీస్కొని ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు.
— Suhas 📸 (@ActorSuhas) February 9, 2024
మీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిది. నటుడిగా నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు, నా స్థాయిలో కథలను ఎంచుకుని మీ ముందుకు తీసుకురావడమే నా చిన్న ప్రయత్నం. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు వాటికి ఉదాహరణలు. వచ్చే నెలల్లో నేను కథానాయకుడుగా మీ ముందుకి రాబోయే ప్రసన్న వదనం, దిల్ రాజు గారు నిర్మాతగా సందీప్ రెడ్డి బండ్ల ప్రాజెక్ట్, మరియు కేబుల్ రెడ్డి సినిమాలతో మీరు థియేటర్ కి వచ్చి హాయిగా నవ్వుకొని ఆస్వాదించే ఇంకొక మూడు మంచి సినిమాలతో మీ ముందుకి రాబోతున్నాను. హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మరొక హ్యాట్రిక్ ఇస్తారు అని నా ప్రయత్నం నేను చేస్తూనే, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆ లెటర్లో రాసుకొచ్చాడు సుహాస్.