Radheshyam P.R.O: తొందర పడి కోయిల ముందే కూసింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది!
సామాజిక మాధ్యమాలు ఎంత సెన్సిటివ్ గా ఉంటాయో మరోసారి తెలిసాయి .. రాధేశ్యామ్ పి ఆర్ ఓ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంది.
- By Balu J Published Date - 01:35 PM, Wed - 5 January 22

సామాజిక మాధ్యమాలు ఎంత సెన్సిటివ్ గా ఉంటాయో మరోసారి తెలిసాయి .. రాధేశ్యామ్ పి ఆర్ ఓ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. గీతా ఆర్ట్స్ తో అతనికున్న అనుబంధం.. బన్నీ అంటే అతనికున్న ఆరాధన ఇప్పుడు అతన్ని కష్టాల పాలు చేసాయి.. క్రిసమస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పుష్ఫదే అంటూ ఆయన చేసిన ట్వీట్ పై అభిమానులు సెగలు కక్కారు.. అసలే సినిమా వస్తుందా రాదా అనే సందేహాలతో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ ట్వీట్ మంట ఎక్కేలా చేసింది. దీంతో డార్లింగ్ అభిమానులు సదరు ఆ పిఆర్ ఓ మీద తిట్ల దండకం అందుకున్నారు. అంత అభిమానం ఉంటే బన్నీ వద్దే పనిచేసుకో.. యువి ని వదిలేయ్.. అంటూ హుకుం జారీ చేసారు.
తర్వాత యువి నుండి రాధేశ్యామ్ వాయిదా అని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినా.. ఒక పి ఆర్ ఓ గా ఇతను చేసిన ట్వీట్ డార్లింగ్ అభిమానులకు కోపం కట్టలు తెచ్చుకునేలా చేసింది. వాయిదా అనేది బాధ ను కలిగిస్తుంది. అలాంటి వార్తలు చెప్పే టప్పుడు బాలెన్స్ గా ఉండాలి.. అంతే గాని మరో హీరో ని హైప్ చేస్తూ సంక్రాంతి నీదే అనడం ఇక్కడ వివాదాలకు దారి తీసింది. తమ హీరో సినిమా పోస్ట్ పోన్ అవడం పి ఆర్ ఓ కి ఇంత ఆనందంగా ఉందా అనేది డార్లింగ్ ఫ్యాన్స్ ని మండించింది. తర్వాత ఆ పి ఆర్ ఓ క్షమించమని అడిగినా.. డార్లింగ్ ఫ్యాన్స్ శాంతించలేదు.. మరి యువి క్రియేషన్స్ కి ఇది మరో తలనోప్పిగా దాపురించింది. ఈ వాయిదాల సుడిగుండంలో పి ఆర్ ఓ చిక్కుకుపోయాడు.. ఎప్పటికి బయటపడతాడో…
