7/G Brindavan Colony : ‘7/G బృందావన కాలని’ సినిమాకు సీక్వెల్ పై క్లారిటీ.. రీ రిలీజ్‌తో పాటే సీక్వెల్ వర్క్స్ మొదలు..
7/G బృందావన కాలని రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత AM రత్నం ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు.
- By News Desk Published Date - 07:36 PM, Sun - 17 September 23

స్టార్ నిర్మాత AM రత్నం తనయుడు రవికృష్ణ(Ravikrishna) హీరోగా, సోనియా అగర్వాల్(Sonia Agarwal) హీరోయిన్ గా సెల్వ రాఘవన్(Selva Raghavan) దర్శకత్వంలో 2004లో వచ్చిన సినిమా 7/G బృందావన కాలని. అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రేమ అంటూ అమ్మాయి వెనక పడ్డ ఒక ఖాళీగా తిరిగే కుర్రాడు ఆ అమ్మాయి వాళ్ళ ఎలా బాగయ్యాడు, ఆ అమ్మాయి చనిపోయినా తన మీద ప్రేమతోనే ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ప్రేమ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.
7/G బృందావన కాలని ప్రేమ సినిమాల్లో కల్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామని, ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తామని అంటున్నారు. సినిమా రిలీజయిన 19 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అధికారికంగా సినిమా యునిట్ ప్రెస్ మీట్ పెట్టారు. 7/G బృందావన కాలని సినిమాని సెప్టెంబర్ 22న రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో రవికృష్ణ, హీరోయిన్ సోనియా అగర్వాల్, నిర్మాత AM రత్నం, కమెడియన్ సుమన్ శెట్టి.. అంతా హాజరయ్యారు.
7/G బృందావన కాలని రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత AM రత్నం ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. AM రత్నం మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమాల్లో 7/G బృందావన కాలని ఒక కల్ట్ సినిమా. ఈ చిత్రాన్ని మరోసారి తప్పకుండా ఆదరిస్తారనే రీ రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ పనులు మొదలు కానున్నాయి. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవన్ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తారు. స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అయింది. మరో నెల రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తాం. 7/G బృందావన కాలని సీక్వెల్ కి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు అని తెలిపారు.
Also Read : Kollywood : అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన కీర్తి తండ్రి
దీంతో ఈ సినిమా అభిమానులు రీ రిలీజ్ రోజు సెప్టెంబర్ 22న థియేటర్స్ లో సినిమా చూడటానికి రెడీ అయిపోయారు. ఇక సీక్వెల్ కూడా త్వరగా తెరకెక్కించాలని కోరుకుంటున్నారు.