2025 Sankranti Movies : సంక్రాంతి బరిలో ఆ ముగ్గురేనా..?
2025 Sankranti Movies : ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా బరిలో నిలువబోతున్నాయని మొన్నటి వరకు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతం మూడు సినిమాలు మాత్రమే బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది
- Author : Sudheer
Date : 19-11-2024 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
సంక్రాంతి (Sankranti ) పండగ అంటే చాలు తెలుగు ప్రజలకే కాదు సినీ లవర్స్ (Movie Lovers) కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే నిర్మాతలు సైతం సంక్రాంతి బరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు. ప్రతి ఏడాది అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోల చిత్రాలు. తమిళ్ డబ్బింగ్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తూ తమ సత్తాను చాటుకుంటూ ఉంటాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా బరిలో నిలువబోతున్నాయని మొన్నటి వరకు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతం మూడు సినిమాలు మాత్రమే బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.
రామ్ చరణ్ – శంకరుల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) జనవరి 10న వస్తుంటే బాలకృష్ణ – బాబీ కలయికలో సినిమా ‘డాకూ మహారాజ్’ (Daku Maharaj) 12న విడుదల కానుంది. 14న వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki Vasthunnam) ఈ మూడు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. వాస్తవానికి ఈ మూడింటితో పాటు సందీప్ కిషన్ ‘మజాకా’ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైవరం’ చిత్రాలను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలూ బరిలోనుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళం నుంచి అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల కానుంది. అజిత్ కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. సినిమా బాగుంటే తప్ప, థియేటర్లకు వెళ్లే సాహసం చేయరు. సో అజిత్ సినిమాను పోటీగా చూడాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూడు సినిమాలు గేమ్ ఛేంజర్ ఓ పొలిటికల్ థ్రిల్లర్. బాలయ్యది యాక్షన్ ధమాకా. వెంకటేష్‌ది ఫ్యామిలీ మార్క్ ఎంటర్‌టైనర్..ఈ మూడు జోనర్ల చిత్రాలు ప్రేక్షకులను ఈమేరకు అలరిస్తాయో..ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాయో చూడాలి.
Read Also : Jani Master : జైలు నుండి వచ్చాక ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్లో మాట్లాడిన జానీ మాస్టర్..