Anil Ambani : అనిల్ అంబానీకి బిగ్ షాక్ ఇచ్చిన SBI ..మోసగాళ్ల లిస్ట్ లో అయన పేరు
Anil Ambani : పార్లమెంట్‌లో మంత్రివర్గ సహాయక మంత్రి పంకజ్ చౌధరీ ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా లోక్‌సభకు తెలిపారు
- By Sudheer Published Date - 03:18 PM, Tue - 22 July 25

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సంస్థను మరియు ఆ సంస్థ ప్రమోటర్ డైరెక్టర్ అయిన అనిల్ అంబానీ(Anil Ambani)ని ‘మోసగాళ్లు’గా ప్రకటించింది. ఈ మేరకు జూన్ 13, 2025న ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మంత్రివర్గ సహాయక మంత్రి పంకజ్ చౌధరీ ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా లోక్‌సభకు తెలిపారు. ఆయన వెల్లడించిన దాని ప్రకారం..బ్యాంక్ అంతర్గత విధానాలకు అనుగుణంగా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఫ్రాడ్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలను అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
Krithi Shetty: కృతి శెట్టి మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఫస్ట్ టైం ముద్దుగుమ్మని ఇలా చూడటం
ఈ నిర్ణయాన్ని ఎస్‌బీఐ జూన్ 24, 2025న ఆర్బీఐకి నివేదించింది. అనంతరం ఈ మోసం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) వద్దకు పంపేందుకు చర్యలు ప్రారంభించిందని చెప్పారు. జూలై 1, 2025న ఆర్‌కామ్ సంస్థకు నియమించబడిన రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు అధికారికంగా సమాచారం ఇచ్చారు. ఇది కంపెనీ పారదర్శకత నిబంధనల కింద వెల్లడించాల్సిన అంశాల్లో ఒకటిగా ఉంది.
ఎస్‌బీఐకు ఆర్‌కామ్‌పై రూ. 2,227.64 కోట్ల ఫండ్ బేస్డ్ రుణ బకాయిలు ఉన్నాయని, అలాగే రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారంటీలు ఉన్నాయని సమాచారం. ఆర్‌కామ్ ప్రస్తుతం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియలో ఉంది. 2020లోనే దీని రిజల్యూషన్ ప్లాన్‌కు క్రెడిటర్ల కమిటీ ఆమోదం తెలిపింది. మార్చి 6, 2020న ముంబై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వద్ద దాఖలు చేశారు. కానీ ఇప్పటివరకు తుది తీర్పు వెలువడలేదు.
Maharashtra : ప్రేమిస్తావా..లేదా అంటూ మైనర్ బాలికపై కత్తితో యువకుడు బెదిరింపు
గతంలోనూ ఎస్‌బీఐ నవంబర్ 10, 2020న ఇదే రీతిగా ఆర్‌కామ్‌ను ఫ్రాడ్‌గా ప్రకటించి జనవరి 5, 2021న సీబీఐకి ఫిర్యాదు చేసింది. అయితే జనవరి 6న ఢిల్లీ హైకోర్టు స్టేటస్ క్వో ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఫిర్యాదు తిరస్కరించబడింది. తర్వాత 2023లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రుణగ్రహీతకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండానే ‘ఫ్రాడ్’గా ప్రకటించకూడదని తెలిపింది. దీనిపై కొత్తగా 2024లో జారీ చేసిన ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఎస్‌బీఐ తిరిగి ప్రక్రియ ప్రారంభించి మళ్లీ జూన్ 2025లో ఆర్‌కామ్‌ను ఫ్రాడ్‌గా ట్యాగ్ చేసింది. దీనితోపాటు, అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా కేసును కూడా ఎన్‌సీఎల్‌టీలో విచారణకు పంపింది.