Gold Price Today : దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!
Gold Price Today : చరిత్రలో తొలిసారిగా బంగారం ధర రూ.లక్షను దాటి రూ.1,02,330కి చేరింది. ఇది నిన్నటి ధరతో పోల్చితే రూ.1,040 పెరుగుదల.
- By Sudheer Published Date - 11:32 AM, Wed - 23 July 25

పసిడి ప్రియుల గుండెల్లో దడ పుట్టేలా బంగారం ధరలు (Gold Price) మరోసారి ఆకాశానికి తాకాయి. చరిత్రలో తొలిసారిగా బంగారం ధర రూ.లక్షను దాటి రూ.1,02,330కి చేరింది. ఇది నిన్నటి ధరతో పోల్చితే రూ.1,040 పెరుగుదల. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఈ స్థాయికి చేరడం పసిడి మార్కెట్‌లో సంచలనం రేపింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 పెరిగి రూ.93,800గా నమోదైంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే దారిలో పరుగులు పెడుతుంది. కేజీ వెండి ధర నిన్నటి రూ.1,28,000 నుంచి రూ.1,29,000కి పెరిగింది. అంటే ఒక్కరోజులోనే వెండి పై రూ.1,000 పెరిగినట్టవుతుంది. వివాహాలు, శుభకార్యాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆభరణాల కొనుగోలు పెరుగుతుండడం వల్ల డిమాండ్ అధికమై, ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ధరలే ప్రబలంగా ఉన్నాయి.
Dhankhar To QUIT : జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి..?
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ధరల పెరుగుదలకు వినియోగం పెరగడం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, మరియు అమెరికా వంటి దేశాల్లో చమురు ధరలు, వడ్డీ రేట్లు పెరగడం వంటి అంశాలు కూడా ముఖ్యంగా ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ పరిణామాలు బంగారం ధరను రాకెట్‌లా పైకి నెత్తినెత్తుతున్నాయని స్పష్టం చేశారు.
ఈ వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇక్కడే ఆగిపోవని, మరికొంతకాలం ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వల పెంపు, మదుపరుల ఆసక్తి వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తూ ఉండనున్నాయి. దాంతో భవిష్యత్తులో బంగారం మరింత విలువను సంతరించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేసే వారికి ఇది ఒక ఆలోచించాల్సిన సమయమని సూచిస్తున్నారు.