AP Roads : బస్సు యాత్ర చేపడితే కానీ రోడ్ల పరిస్థితి వైసీపీ నేతలకు తెలియరాలేదు
బసు పైన ఉన్న నేతలు అటు , ఇటు ఊగుతూ ఉండడమే సరిపోయింది. గుంతల రోడ్ల ఫై ప్రయాణం చేయలేక, ఆ బాధను బయటికి చెప్పుకోలేక నేతలంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ముందుకు వెళ్లారు
- Author : Sudheer
Date : 27-10-2023 - 4:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో రోడ్ల (AP Roads) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో రోడ్ల ఫై ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుండి ప్రజలు రోడ్లు బాగుచేయాలని కోరుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర (YSRCP Samajika Sadhikara Bus Yatra) ను వైసీపీ నేతలు ఇచ్ఛాపురం నుండి ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా పార్టీ కి ఎంత మైలేజ్ వస్తుందో కానీ నేతలకు మాత్రం నడుం పట్టుకోవడం గ్యారెంటీ అని తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల గురించి చెప్పడం ఏమో కానీ ఈ రోడ్ల గురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేకపోతున్నారు.
నిన్న తెనాలి మండలం కొలకలూరు నుంచి నందివెలుగు మార్గంలో గురువారం సాగిన ఈ యాత్ర నేతలకు చుక్కలు చూపించింది. ఈ మార్గంలో రోడ్లన్నీ గుంతలుపడ్డాయి. కుదుపులు లేకుండా వాహనం మూడు మీటర్లూ ముందుకు వెళ్లలేకపోయింది. బసు పైన ఉన్న నేతలు అటు , ఇటు ఊగుతూ ఉండడమే సరిపోయింది. గుంతల రోడ్ల ఫై ప్రయాణం చేయలేక, ఆ బాధను బయటికి చెప్పుకోలేక నేతలంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్ల ఫై దృష్టి పెట్టి బాగు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక బస్సు ఫై నేతల కష్టాలు , రోడ్ల ఫై బస్సు పడిన కష్టాలకు సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Read Also : Chandrababu : చంద్రబాబు లెటర్ తో మరింత ఆందోళనకు గురవుతున్న కుటుంబ సభ్యులు