HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Leaders Should Get Up Cm Yogi Style Treatment If Needed Pawan Kalyan

వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు.

  • Author : Sudheer Date : 20-12-2025 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Amaravati
Pawan Amaravati
  • పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
  • జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్
  • తనపై అమ్ముడుపోయారనే నిందలు వేసినా ప్రజల కోసం తగ్గానని పవన్ ఆవేదన

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి పర్యటనలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించే వారిని జైలుకు పంపుతామన్న జగన్ వ్యాఖ్యలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లుగా ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పార్టీని నడిపానని, తనపై అమ్ముడుపోయారనే నిందలు వేసినా ప్రజల కోసం తగ్గానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇంతటి ఘోర పరాజయాన్ని ఇచ్చినా వైకాపా నేతలకు బుద్ధి రాలేదని, ఇంకా రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు తమకు రెండు రోజులు చాలని, అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు.

రాజకీయాల్లో తన ప్రయాణం స్వార్థం కోసం కాదని, అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సాగుతోందని పవన్ పేర్కొన్నారు. అధికారం ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినా తిరిగి వెళ్తానో లేదో తెలియని పరిస్థితుల్లోనే పోరాడుతున్నానని, అందుకే తనకు చావు భయం లేదని ఉద్వేగంగా మాట్లాడారు. ముఖ్యంగా పిఠాపురంలో చిన్న పిల్లలను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుందని, హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

రాజకీయ విమర్శల పక్కన పెడితే, ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రూ. 7,910 కోట్లతో చేపట్టిన ‘అమరజీవి జలధార’ పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర పథకం ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు మరియు కోనసీమ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడేది లేదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా పవన్ పునరుద్ఘాటించారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • pawan kalyan warning
  • UP CM Yogi-style treatment
  • ycp

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd