YSR Assets : వైస్సార్ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్
YSR Assets : తనకే సరస్వతీ పవర్ వాటాలపై పూర్తి హక్కులున్నాయని ఆమె ఎన్సీఎల్టీ (జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్) ఎదుట స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 09:59 AM, Fri - 28 February 25

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం(YSR Family Controversy)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సరస్వతీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల (Saraswati Power Corporation Limited shares) విషయంలో వైఎస్ విజయమ్మ (Vijayamma)కోర్టులో తీసుకున్న వైఖరి పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడు వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు భిన్నంగా, తనకే సరస్వతీ పవర్ వాటాలపై పూర్తి హక్కులున్నాయని ఆమె ఎన్సీఎల్టీ (జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్) ఎదుట స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ తన పేరుపై వాటాలను బదిలీ చేసుకున్నానని, అందువల్ల ఈ వివాదంలో తనను అన్యాయంగా లాగడం తగదని విజయమ్మ వాదించారు. ముఖ్యంగా తన కుమార్తె వైఎస్ షర్మిలతో రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ వివాదాన్ని కోర్టులో నడిపించడం అన్యాయం అని పేర్కొన్నారు.
YCP : జగన్ ను సంతోషపెట్టిన వారంతా ఊచలు లెక్క పెట్టాల్సిందేనా..?
వైఎస్ విజయమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో సరస్వతీ పవర్ కంపెనీలోని 1.21 కోట్ల వాటాలను సండూర్ కంపెనీ, క్లాసిక్ రియాల్టీ లిమిటెడ్ నుంచి తనకు బదిలీ చేశారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, జగన్ 74.26 లక్షల వాటాలు, భారతి 40.50 లక్షల వాటాలు తనకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారని తెలిపారు. దీన్ని సరస్వతీ పవర్ బోర్డు కూడా ఆమోదించి, ఆమెను సభ్యురాలిగా గుర్తించిందని పేర్కొన్నారు. దీంతో, తాను కంపెనీలో 99.75 శాతం వాటాలను కలిగి ఉన్నందున, ఈ అంశంలో తనను ప్రశ్నించడం అనుచితమని ఆమె కోర్టుకు వివరించారు. అంతేకాదు, జగన్, భారతి తనకు గిఫ్ట్ డీడ్ ద్వారా వాటాలు ఇచ్చారని చెప్పడం నిరాధారమని, షర్మిల కోసమే ఈ బదలాయింపులు జరిగాయన్న వాదనకు ఎలాంటి పత్రాలు లేవని విజయమ్మ స్పష్టం చేశారు.
Local Quota : విద్యారంగంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..
ఈ వ్యవహారంలో వైఎస్ కుటుంబంలో ఉన్న విభేదాలు మరింత స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల, జగన్ మధ్య రాజకీయ విభేదాలు బయటకు వస్తున్న తరుణంలో, ఇప్పుడు ఆస్తుల వివాదం కూడా తెరపైకి రావడం వైఎస్సార్ కుటుంబానికి మరింత ఇబ్బందికరంగా మారింది. విజయమ్మ తన వైఖరిని కోర్టులో స్పష్టంగా తెలియజేసిన తర్వాత, జగన్ మరియు భారతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.