Janasena : జనసేన కోసం ప్రచారం చేస్తా అంటున్న యంగ్ హీరో
నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు
- Author : Sudheer
Date : 11-04-2024 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ (YCP) సింగిల్ గా బరిలోకి దిగుతుండగా..టీడీపీ (TDP) , జనసేన (Janasena) , బిజెపి (BJP) పార్టీలు కూటమి గా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారం కోసం సినిమా స్టార్లను , బుల్లితెర నటి నటులను రంగంలోకి దింపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లును రంగంలోకి దింపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అంబటి రాయుడు (క్రికెటర్), కొరియోగ్రాఫర్ జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు జనసేన పార్టీ తన అధికార సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. త్వరలోనే వీరు ప్రచారం చేయబోతున్నారు. వీరు మాత్రమే కాదు మరికొంతమంది కూడా తమవంతు ప్రచారం చేస్తాం అంటూ ప్రకటిస్తున్నారు.
తాజాగా యంగ్ హీరో నవదీప్ (Navadeep) మాట్లాడుతూ.. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. తాను నటించిన ‘లమ్హమౌళి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా నవదీప్ చాల క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
Read Also : Vijay Devarakonda : ఒత్తిడిలో విజయ్ దేవరకొండ..?