Gorantla Madhav : జైలులో గోరంట్ల మాధవ్ గొంతెమ్మ కోరికలు
Gorantla Madhav : గతంలో పోలీసు అధికారి, ఆ తరువాత ఎంపీగా వ్యవహరించిన గోరంట్ల మాధవ్‌కి ఇప్పుడు జైలులో సాధారణ ఖైదీగా మెలగడం ఇష్టం లేకనే ఇలా చేస్తున్నాడని అంటున్నారు
- Author : Sudheer
Date : 15-04-2025 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చేబ్రోలు కిరణ్(Chebrolu Kiran )పై దాడి కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్‌లో ఉన్నారు. అయితే జైలు గదిలోకి వెళ్లేందుకు నిరాకరించి అధికారులతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. రెండు చేతులు వెనక్కి పెట్టి బయటే ఉంటా, గదిలోకి వెళ్లను అంటూ మొండిగా వ్యవహరిస్తున్నారని జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయనకు 3130 నంబర్ కేటాయించారు. కానీ జైలు నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తూ అధికారుల్ని చికాకు పెడుతున్నాడు.
Petrol Diesel Prices: తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?
గతంలో పోలీసు అధికారి, ఆ తరువాత ఎంపీగా వ్యవహరించిన గోరంట్ల మాధవ్‌కి ఇప్పుడు జైలులో సాధారణ ఖైదీగా మెలగడం ఇష్టం లేకనే ఇలా చేస్తున్నాడని అంటున్నారు. అధికారులతో మాట్లాడేందుకు, వారిపై అనవసరంగా ప్రశ్నల వర్షం కురిపించడం వల్ల జైలు సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. రోజూ తనకిచ్చే భోజనంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది తినాలని చెప్పేందుకు మీరెవరు ?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట. పార్లమెంట్ క్యాంటీన్‌లో లభించే వంటకాలు జైల్లో ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించే స్థాయిలో ఆయన అహంకారాన్ని చూపిస్తున్నారు.
జైలులో సిబ్బంది షిప్టులు మారే సమయంలో వారితో వాగ్వాదానికి దిగుతున్న గోరంట్లను హ్యాండిల్ చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారిందని టాక్. జైలు నిబంధనలను అంగీకరించకుండా వేరు విధంగా ప్రవర్తించడం వల్ల మాధవ్‌కి ప్రత్యేక పర్యవేక్షణ అవసరమవుతోంది. మరో రెండు వారాలు ఆయన జైల్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, అక్కడి సిబ్బందికి గోరంట్ల వల్ల తలనొప్పి తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.