AP : పవన్ కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థి
పొన్నూరులో పవన్ కల్యాణ్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను అర్ధరాత్రి జేసీబీతో అంబటి మురళి తన అనుచరులతో ధ్వంసం చేయించారు
- Author : Sudheer
Date : 04-05-2024 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నేతలు (YCP Leaders) దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు కూటమి అభ్యర్థులకు ప్రజా ఆదరణ పెరుగుతుండడం..వైసీపీ ఫై వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వైసీపీ అభ్యర్థుల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. దీంతో ఏంచేయాలో తెలియక కూటమి నేతల పర్యటలను అడ్డుకోవాలని చూస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ను అడ్డుకోవాలని ప్లాన్ చేసారు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి.
We’re now on WhatsApp. Click to Join.
పొన్నూరులో పవన్ కల్యాణ్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను అర్ధరాత్రి జేసీబీతో అంబటి మురళి తన అనుచరులతో ధ్వంసం చేయించారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పరిశీలించిన తర్వాత అర్దరాత్రి హెలిపాడ్ ను ధ్వంసం చేయడం వైసీపీ అభ్యర్థి పనేనని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పటికే ఎన్నో అవినీతి , అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి..ఇప్పుడు ఈ హెలిప్యాడ్ ధ్వంసంతో తన అసలు ముసుగును తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ పొన్నూరు పర్యటనను అడ్డుకునేందుకు మురళి ఎన్ని చేసిన.. పవన్ పర్యటన ను ఆపలేరని నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వస్తే తనకు ఘోరమైన ఓటమి తప్పదనే అక్కసుతో హెలిపాడ్ ధ్వంసం చేశారని విమర్శించారు.
అంబటి మురళి ముసుగు తొలిగింది. నిజస్వరూపం బయటపడింది. పొన్నూరులో ఓటమి ఖాయమని తెలిసి #Janasenani @PawanKalyan గారి పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ అభ్యర్థి అంబటి మురళికృష్ణ చేస్తున్న కుట్రలను పొన్నూరు ప్రజలే తిప్పికొడతారు. హెలిపాడ్ ను ధ్వంసం చేసి పైశాచికానందం పొందుతున్న వైసీపీ రౌడీలంతా… pic.twitter.com/4VR0LD3cge
— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) May 4, 2024
Read Also : Brazil : బ్రెజిల్‌లో భారీ వర్షాలు..కొండచరియలు విరిగి 37 మంది మృతి