YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్
- Author : Sudheer
Date : 01-03-2024 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ పార్టీ (YCP) వరుసపెట్టి జాబితాలను (Incharge List) విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన జగన్..ఈరోజు 9 వ జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం(Mangalagiri Constituency)లో ఇన్‌ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) స్థానంలో మురుగుడు లావణ్య (Lavanya Murugudu) పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే లావణ్య.
We’re now on WhatsApp. Click to Join.
కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, గంజి చిరంజీవి, కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులతో చర్చించిన అనంతరం వైసీపీ పెద్దలు లావణ్య పేరును ఖరారు చేసారు. దీనిబట్టి లోకేష్ ఫై లావణ్య బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని ప్రకటించగా, కర్నూలుకు ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)ని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంతియాజ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడిన అనుభవం లేని విజయసాయి రెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది.
Read Also : Inter Exams : విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఇంటర్ బోర్డు