Yanamala Krishnudu : వైసీపీ లోకి యనమల కృష్ణుడు..?
టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు
- By Sudheer Published Date - 11:32 AM, Thu - 25 April 24

మరో మూడు వారాల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ (TDP)కి భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) పార్టీకి రాజీనామా చేసి ..వైసీపీ (YCP) లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్త ఇప్పుడు కూటమి లో ఖంగారు పుట్టిస్తుంది. గత కొంతకాలంగా యనమల సోదరుల మధ్య విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే యనమల కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్చర్చలు జరిపారని అంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 27న కృష్ణుడు వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అంతే కాదు ఈరోజు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్ కార్యక్రమంలో యనమల కృష్ణుడు పాల్గొంటారని తెలుస్తోంది. ఒకవేళ కృష్ణుడు వైసీపీ లో చేరితే ఆ ఎఫెక్ట్ టీడీపీ ఫై భారీగా పడుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. మరి ఇప్పటికైనా బాబు ..కృష్ణుడు తో మాట్లాడి సర్దిచెపితే బాగుంటుందని అంత భావిస్తున్నారు.