Polavaram Project : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని..సీఎంను ప్రశ్నించిన మహిళ
డిసెంబర్‌లో ప్రారంభిస్తే మళ్లీ మే లో పూర్తి చేయాల్సి ఉంటుంది. గోదావరి నది వరదల కారణంగా ఏడాదిలో 6 నెలలే పనులు జరుగుతాయి
- Author : Sudheer
Date : 01-07-2024 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు పబ్లిక్ సభ లో మహిళ నుండి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా చంద్రబాబు నవ్వుతు సమాధానం చెప్పి తన హుందాతనం చాటుకున్నారు. ఏపీలో ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం పింఛన్ రూ. 4వేలతో పాటు.. గత మూడు నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తం రూ. 7వేల పింఛన్ ను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తుంది. ఇక ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సభలో ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఎప్పుడు పూర్తవుతుందో లేదని, పెనుమాక సభలో ఓ మహిళ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు నవ్వుతూ సమాధానమిచ్చారు. జూలైలో వర్షాలు వస్తాయి. డిసెంబర్‌లో ప్రారంభిస్తే మళ్లీ మే లో పూర్తి చేయాల్సి ఉంటుంది. గోదావరి నది వరదల కారణంగా ఏడాదిలో 6 నెలలే పనులు జరుగుతాయి. గత ప్రభుత్వం 2 ఏళ్లు పట్టించుకోకపోవడంతో డయాఫ్రవాల్, కాపర్ డ్యాం దెబ్బతిన్నాయని సూచించారు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. నివేదిక ఇస్తారు అని సీఎం చంద్రబాబు వివరించారు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి..? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు.
Read Also : Tragedy : విషాదం నింపిన విహార యాత్ర..కళ్లముందే వరదలో కొట్టుకుపోయిన కుటుంబం