Mahanadu : మహానాడులో నందమూరి బాలకృష్ణ ఎక్కడ..?
Mahanadu : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడును మళ్లీ ఎన్నుకోవడం జరిగింది
- By Sudheer Published Date - 02:55 PM, Thu - 29 May 25

కడప జిల్లాలో ఘనంగా జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు(Mahanadu)లో నేతల సందడి, కార్యకర్తల ఉత్సాహం ఊపందుకుంది. రాయలసీమ గడ్డపై టీడీపీ ఈవెంట్ నిర్వహించడమే విశేషం. మే 27, 28 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పలు కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడును మళ్లీ ఎన్నుకోవడం జరిగింది. అయితే, మహానాడు వేదికపై ముఖ్య నేతలంతా సందడి చేసినా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది.
Kavitha : చంద్రబాబు వ్యాఖ్యలు నవ్వొస్తున్నాయి – కవిత
నందమూరి బాలయ్య ప్రస్తుతం జార్జియాలో ఉన్నట్లు సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన నటిస్తున్న అఖండ 2 : తాండవం మూవీకి సంబంధించిన షూటింగ్ అక్కడ జరుగుతోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అఖండ 2 యూనిట్ అక్కడే బాలయ్యతో కలిసి నివాళులు అర్పించారట. ఈ షెడ్యూల్‌లో 10 రోజుల పాటు యాక్షన్ పార్ట్ చిత్రీకరణ కొనసాగుతుందని, జూన్ 6న బాలయ్య తిరిగి రానున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మిగిలిన టాకీ పార్ట్ మరియు పాటల చిత్రీకరణ జూలైలో జరుగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే రెండు రోజులపాటు మహానాడు కార్యక్రమాల్లో బాలయ్య కనిపించకపోవడంతో అభిమానుల మధ్య ఆందోళన నెలకొంది. ఇటీవలే బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు లభించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. హిందూపురంలో కూడా భారీ సన్మాన సభ జరిగింది. అయినా మహానాడు వేదికపై ఆయన గైర్హాజరైతే ఏమవుతుందన్న సందేహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.