Viral Video: గోదావరిలో కొట్టుకోపోయిన ఆలయం…సోషల్ మీడియాలో వీడియో వైరల్..!!
గోదావరి వరదల్లో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో గోదావరి నది ఒడ్డున వనదుర్గ ఆలయం ఉంది.
- By hashtagu Published Date - 09:44 AM, Sat - 30 July 22
గోదావరి వరదల్లో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో గోదావరి నది ఒడ్డున వనదుర్గ ఆలయం ఉంది. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో నిన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మధ్య కురిసిన భారీవర్షాలకు గోదావరి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరింది.
వరద తాకిడికి కోతకు గురికావడంతో మధ్యాహ్నానికి ఆలయం బీటలు వారింది. సాయంత్రానికి నదిలో పడిపోయింది. ఆలయం కొట్టుకుపోవడం ఖాయమని గ్రహించిన గ్రామస్థులు గుడిలోకి భక్తులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
source :ETV Andrapradesh