Cabinet Ministers : ఏపీ నుండి ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు..?
రామ్మోనాయుడికి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం
- Author : Sudheer
Date : 08-06-2024 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఈసారి మోడీ కేంద్ర వర్గంలో ఇద్దరికీ అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే సొంతంగా కాదు కూటమి పార్టీల మద్దతు మోడీ మరోసారి ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ఏపీ అధికార పార్టీ NDA కూటమికి కీలకంగా మారింది. ఏపీలో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకొని సంచలన విజయం సాధించింది. అయితే కేంద్రంలో ఏపీ సపోర్ట్ చాల కీలకంగా మారడంతో చంద్రబాబు షరతులకు కేంద్రం ఒప్పుకోకతప్పడం లేదు. ఈ క్రమంలో ఏపీ నుండి పలువురికి కీలక పదవులు కోరడం తో చివరికి ఇద్దరికీ కేంద్ర మంత్రుల అవకాశం ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నట్లు సమాచారం. రామ్మోనాయుడికి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పలువురు మంత్రులు కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీ ఎంపీలిద్దరూ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 7.15 PM గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. పలు దేశాధినేతలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మరి ఏపీ నేతలకు ఏ శాఖలు ఇస్తారో చూడాలి.
Read Also : Ramoji Rao: రామోజీ రావు విజయాల వెనుక ఉన్న రహస్యమిదే