HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tweet War Continues Between Ys Jagan And Nara Lokesh

Tweet War : `సిగ్గులేని జ‌న్మ‌`పై దుమారం!

'జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ` అంటూ తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది.

  • Author : CS Rao Date : 23-06-2022 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

‘జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ` అంటూ తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. బూతులు, అస‌భ్య వ్యాఖ్య‌ల‌కు దూరంగా ఉండే లోకేష్ ఇటీవ‌ల మాట తూలుతున్నారు. అదేమంటే, ఎదుటి వాళ్లు ఉప‌యోగించిన ప‌దాల‌కు ధీటుగా స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న‌కు ప్ర‌త్యేక ట్రైనింగ్ బెంగుళూరు బ్యాచ్ ఇస్తోంద‌ట‌. `వైసీపీ కుక్క‌లు, జ‌గ‌న్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం, ఒరై జ‌గ‌న్ రెడ్డి.. ఇలాంటి ప‌దాలు వాడేసినా మాస్ లీడ‌ర్ గా ఇంకా లోకేష్ పూర్తి స్థాయికి ఎద‌గ‌లేద‌ని ట్రైన‌ర్లు భావిస్తున్నార‌ట‌. అందుకే, తాజాగా `జ‌గ‌న్ రెడ్డిది సిగ్గులేని జ‌న్మ‌` అంటూ ట్వీట్ట‌ర్లో పోస్ట్ పెట్టారు.

జగన్ రెడ్డి ది సిగ్గు లేని జన్మ ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ @ysjagan తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం @ncbn గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.(1/2) pic.twitter.com/o3DeuEQOsp

— Lokesh Nara (@naralokesh) June 23, 2022

ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ కు వ్యసనంగా మారిందని ట్విట్ట‌ర్లో ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు, ఏపీని ఎల‌క్ట్రానిక్ హ‌బ్ గా మార్చేస్తున్నామ‌ని ప‌లు కంపెనీల‌తో వైసీపీ ప్ర‌చారం చేసుకుంటోన్న పోస్ట‌ర్ ను కూడా ట్విట్ట‌ర్లో జ‌త చేశారు. ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా జగన్ తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి` అంటూ ట్విట్ట‌ర్లోని సారంశం. దానికి `జ‌గ‌న్ రెడ్డిది సిగ్గులేని జ‌న్మ‌` అంటూ ప‌దాన్ని జోడించ‌డం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

సాధార‌ణంగా చంద్ర‌బాబు త‌ర‌హాలోనే నారా లోకేష్ కూడా బూతు మాట‌లు ఉప‌యోగించ‌రు. తెలుగును పాలిష్ గా మాట్లాడేందుకు ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు లోకేష్‌. క్యాడ‌ర్ ను ఉత్సాహ‌ప‌రిచేలా ఎప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి ప‌దాల‌ను ఉప‌యోగించాలి? స్పీచ్ లో వాడాల్సిన అంశాలు త‌దిత‌రాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు ఒక టీమ్ ప‌నిచేస్తుంటుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ టీమ్ ఇటీవ‌ల లోకేష్ ను మాస్ లీడ‌ర్ గా ఫోక‌స్ చేయ‌డంలో స‌క్సెస్ అయింద‌ని ఆ పార్టీలోని కొంద‌రు భావిస్తున్నారు. అదే త‌రుణంలో వైసీపీ లీడ‌ర్లు వాడే ప‌ద‌జాలానికి అనుగుణంగా వ్యాఖ్య‌ల‌ను జోడించ‌డం కూడా త‌ర్ఫీదు నివ్వడానికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అందుకే, ఎప్పుడూ మాట తూల‌ని లోకేష్ ఇటీవ‌ల కొన్ని ప‌దాల‌ను అనివార్యంగా వాడేస్తున్నారు.

`జ‌న్మ` గురించి ఇప్పుడు లోకేష్ ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డిని ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారో, అదే విధమైన వ్యాఖ్య‌ల‌ను ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబుపైన మాజీ సీఎం. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వాడారు. `నీ అమ్మ‌కు ఎందుకు పుట్టావో.. అంటూ అసెంబ్లీలో ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ వాడిన ప‌ద‌జాలం గంద‌ర‌గోళాన్ని రేపింది. అమ్మ‌ను కించ‌ప‌రుస్తూ వైఎస్ మాట్లాడాడ‌ని అసెంబ్లీని అప్ప‌ట్లో టీడీపీ స్థంభింప చేసింది. స్వ‌ర్గీయ రోశ‌య్య జోక్యం చేసుకోవ‌డంతో ఆ వివాదానికి అసెంబ్లీలోనే తెర‌ప‌డింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి జ‌న్మ గురించి లోకేష్ ట్వీట్ చేయ‌డం పెద్ద దుమారాన్ని రేపుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన జ‌న్మ సంబంధ వ్యాఖ్య‌లు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • lokesh ycp
  • tdp
  • tweet war
  • twitter

Related News

CM Chandrababu

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd